Karumuri Venkata Nageswara Rao
Karumuri Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ సర్కారుపై కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) కలిసినా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు.
అమరావతిలో కారుమూరి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో బహిరంగ సభకు హాజరైన అమిత్ షా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అంటూ ప్రకటన చేస్తే బాగుండేదని చెప్పారు. విశాఖలో సభ పెట్టి అసలు రైల్వే జోన్ గురించే మాట్లాడలేదని విమర్శించారు.
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అనేక దేవాలయాలు కూల్చేశారని, అప్పట్లో బీజేపీ కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉందని, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేని నిలదీశారు. గత లోక్ సభ ఎన్నికల ముందు ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను చంద్రబాబు కించపరిచారని అన్నారు.
నిన్నటి సభలో చంద్రబాబు మనుషులు ఇచ్చిన స్క్రిప్ట్ నే అమిత్ షా చదివారని అన్నారు. అమరావతి ఓ స్కాం అంటూ మాట్లాడింది బీజేపీనే అని చెప్పారు. అక్కడ జరిగిన భూ దోపిడీ గురించి అమిత్ షాకు తెలియదా అని ప్రశ్నించారు. విశాఖలో భూ దోపిడీ ఎక్కడ జరిగిందని నిలదీశారు.
Srihari Rao : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ అసంతృప్తి నేత శ్రీహరి రావు?