వైసీపీ అందుకే ఓడిపోయింది: జగన్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

అంతేగాక, ఇసుక, మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామని..

ఆంధ్రప్రదేశ్‌లోని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్, అధికారులు తమ మాట వినుంటే వైసీపీ ఓడిపోయేది కాదని చెప్పారు.

ల్యాండ్ టైటిల్ యాక్టు కొంపముంచిందని కాటసాని అన్నారు. తాము ల్యాండ్ టైటలింగ్ యాక్టు వద్దని చెప్పామని తెలిపారు. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కారణమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాటవినలేదని చెప్పారు.

అంతేగాక, ఇసుక, మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామని కాటసాని తెలిపారు. రైతులు భూములను లాక్కుంటారనే ప్రచారాన్ని టీడీపీ విపరీతంగా చేసిందని చెప్పారు. తాము కొన్ని తప్పులు చేయడం వల్లనే ఒడిపోయామని తెలిపారు. అధికారులు మాట వినిఉంటే గెలిచే వాళ్లమని అన్నారు.

లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని కాటసాని తెలిపారు. తాను నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం తప్పయితే క్షమించాలని చెప్పుకొచ్చారు. తాము ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పోరాడతామని అన్నారు. తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ తాను ఓడిపోవడం బాధాకరమన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సమానమని తెలిపారు.

ఆయనే నా మార్గదర్శకుడు.. నాలాంటి యువతకు స్ఫూర్తి: నారా లోకేశ్

ట్రెండింగ్ వార్తలు