Kethireddy Venkatarami Reddy (Image Credit To Original Source)
Kethireddy Venkatarami Reddy: సరిగ్గా మాట్లాడాలంటూ తనపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
“రాయలసీమకు అన్యాయం జరిగితే మాట్లాడతాను. ఈ ప్రాంతానికి జరుగుతున్న నష్టం గురించి చెప్పాను. మీరు పౌరుషం చూపించాల్సిన నా మీద కాదు.. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న వారి మీద. నీకు చేతనైతే ఎయిమ్స్, హైకోర్టు, స్టీల్ ఫ్యాక్టరీని తిరిగి తీసుకునిరా.
Also Read: రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే ఎఫ్ఐఆర్‌లు.. మీ ఖేల్ ఖతం దుకాణ్ బంద్?
నీకు చేతనైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సమాధానం చెప్పు. జేసీ నువ్వు తెలుసు.. నీ బతుకు తెలుసు. ఆ రోజు విజయమ్మను దూషించావు. మళ్లీ వెళ్లి ఆమెతో మాట్లాడావు. మిమ్మల్ని నమ్ముకున్న రైతుల గురించి మాట్లాడకుండా దూషణలా. నేను, నా కుటుంబం ఊళ్లకు వెళ్తే దాని గురించి మాట్లాడుతున్నావు.
నువ్వు, నీ కొడుకు ఈ వయసులో డ్యాన్సులు చేయడం ఏంటి? నాకు సంస్కారం ఉంది.. అందుకే దీని గురించి మాట్లాడను. నీ మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు.. నువ్వొక జోకర్‌వి. ఇదే స్థానంలో మీ అన్న దివాకర్ రెడ్డి ఉంటే కచ్చితంగా మాట్లాడేవారు.
నువ్వెలా సంపాదించావో, నీ బతుకు ఏంటో తాడిపత్రి ప్రజలకు తెలుసు. అన్నీ తీసుకుపోయి అమరావతిలో పెడుతుంటే నోరు మూసుకున్నారు. నువ్వు ఏంటో, ఎలా గెలిచావో అందరికీ తెలుసు. నీకు చేతనైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించు” అని అన్నారు.