Andhra Pradesh: అమరావతిలో భూమిలేని పేదల పెన్షన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4,929 మంది పెన్షన్లపై త్రిసభ్య కమిటీ పునరాలోచన చేస్తున్నట్లు తెలిపింది. రద్దు అయిన పెన్షన్లపై దరఖాస్తుల స్వీకరణకు సీఆర్‌డీఏకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.
దీంతో అర్హులైన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇచ్చే యోచనలో ఉంది. గ్రామసభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చని ఏపీ సీఆర్‌డీఏ తెలిపింది. భూమిలేని పేదలకు న్యాయం చేస్తామని తెలిపింది. (Amaravati)
కాగా, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సీఆర్‌డీఏను ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఈ సంస్థ నిర్మాణ పనులపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. పలు జిల్లాలు సీఆర్‌డీఏ పరిధి కిందకు వస్తాయి.