విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు స్కాంలో కీలక పరిణామం..

నరేశ్ ఖాతా నుంచి నెక్సస్ సంస్థలో లావాదేవీలు జరిగినట్లు కనుగొన్నారు.

Vijayawada Icici Bank Scam : విజయవాడ ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ లో కీలక పరిణామం చోట చేసుకుంది. మరోసారి సీఐడీ బృందాలు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడు బ్రాంచుల్లో సోదాలు చేపట్టారు. విజయవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట బ్రాంచుల్లో మూడు బృందాలుగా తనిఖీలు చేపట్టారు. ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బుతో నరేశ్ టీమ్.. నెక్సస్ గ్రోత్ సంస్థను ప్రారంభించినట్లుగా గుర్తించింది సీఐడీ. ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

నరేశ్ ఖాతా నుంచి నెక్సస్ సంస్థలో లావాదేవీలు జరిగినట్లు కనుగొన్నారు. అలాగే కిరణ్, అజిత్ సింగ్ కూడా ఆ సంస్థలో లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు. వీరిద్దరిని కూడా సీఐడీ అధికారులు విచారణకు పిలిచి వివరాలు సేకరించనున్నారు. ఇక ఆ సంస్థను ప్రారంభించిన ప్రభు కిశోర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ లో సీఐడీ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. ప్రత్యేకంగా మూడు బృందాలుగా విడిపోయిన సీఐడీ అధికారులు.. విజయవాడ, నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. విజయవాడ భారతీనగర్ లో సోదాలు చేశారు. అనంతరం నెక్సస్ గ్రోత్ సర్వీసెస్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బును నరేశ్ టీమ్.. పెట్టుబడి పెట్టేందుకు ప్రారంభించిన నెక్సస్ గ్రోత్ సర్వీసెస్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. సంస్థను ప్రారంభించిన ప్రభు కిశోర్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు.

ప్రభు కిశోర్, నరేశ్ తో లావాదేవీలు నడిపిన కిరణ్, అజిత్ సింగ్ నుంచి కూడా సీఐడీ అధికారులు వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. సోదాలు నిర్వహించిన అనంతరం సీల్ వేశారు అధికారులు. నెక్సస్ గ్రోత్ సంస్థను క్లోజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గుంటూరులోని సీఐడీ కార్యాలయాకి వచ్చిన సంస్థకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు.

మొత్తంగా సంచలనం రేపిన ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్ లో సీఐడీ అధికారులు దర్యాఫ్తును వేగవంతం చేశారని చెప్పాలి. కేసుకు సంబంధించి మూడు ప్రత్యేక బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. మొత్తం వ్యవహారంలో నరేశ్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. వెంటనే గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నరేశ్ కు సైతం అధికారులు నోటీసులు ఇచ్చారు.

 

Also Read : వైసీపీలోనే కొనసాగుతారా? జంప్ అవుతారా? మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ దారెటు..