ముహూర్తం ఫిక్స్.. జనసేనలోకి వైసీపీ కీలక నేతలు..

వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు.. జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారైంది.

Joinings In Janasena : వైసీపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా జనసేనలో చేరేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య.. జనసేనలో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.

ఈ నెల 26న జనసేనలో చేరనున్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పలువురు వైసీపీ నేతలు సైతం అదే రోజున జనసేన కండువా కప్పుకోనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో వారంతా పార్టీలో చేరనున్నారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో చేరికల కార్యక్రమం ఉండనుంది. చేరికల విషయమై ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ని కలిశారు.

వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు.. జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు బాలినేని, కిలారి రోశయ్య, సామినేని ఉదయభానులు.. (ఒకరు మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు).. వీరితో పాటు పలువురు కార్పొరేటర్లు, వివిధ విభాగాలకు ఇప్పటివరకు బాధ్యతలు వహించి సీనియర్లుగా ఉన్న పలువురు వైసీపీ నాయకులు అదే రోజున జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సభ్యత్వం తీసుకుంటారు. చేరికల కార్యక్రమాన్ని చాలా భారీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా బాలినేని, రోశయ్య, సామినేని ఉదయభానులు పవన్ కల్యాణ్ ని కలిశారు. 26వ తేదీన వివిధ జిల్లాల్లోని కార్పొరేటర్లు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలు జనసేనలో చేరబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

Also Read : వలస నేతలంతా చలో జనసేన అనటానికి కారణమేంటి? చేరికలపై పవన్ కల్యాణ్ వైఖరేంటి?

”వైసీపీ పట్ల, అధినేత విధానాల పట్ల పూర్తిగా విరక్తి చెందాము. అసంతృప్తికి గురయ్యాము. ఆ పార్టీలో తమకు ఏ విధమైన భవిష్యత్తు ఉండదని నిర్ణయించుకున్నాము. తమ మాటలకు కానీ, తమ సలహాలు సూచనలకు కానీ ఎక్కడా విలువ ఇవ్వలేదు. అందుకనే వైసీపీని వీడుతున్నామని” బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను వంటి సీనియర్ నాయకులు స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. భవిష్యత్తులో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అంటున్నారు. జనసేనలో తమకు ఆదరణ ఉంటుందని, రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని, జనసేనలో తమ కష్టానికి తమ సీనియార్టీకి తగినటువంటి గుర్తింపు, గౌరవం లభిస్తుందనే నమ్మకంతో జనసేనలోకి వెళ్తున్నామని ఇప్పటికే నాయకులు ప్రకటించిన విషయం విదితమే.