Kinjarapu Atchannaidu
యువగళం-నవశకం బహిరంగ సభలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ టార్గెట్ గా చెలరేగిపోయారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని ఆయన పిలుపునిచ్చారు. లేదంటే ఏపీ ప్రజలకు బతుకు లేదని హెచ్చరించారు. ఈసారి టీడీపీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిశారని, ఇక వైసీపీకి దబిడిదిబిడే అన్నారు అచ్చెన్నాయుడు.
”బలహీన వర్గాలను టీడీపీకి దూరం చేయడం జగన్ తరం కాదు. బలహీన వర్గాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ టీడీపీ. బలహీన వర్గాలను అన్ని విధాలుగా ఆదుకున్న పార్టీ టీడీపీ. బలహీన వర్గాలు టీడీపీ, జనసేనలో నాయకులుగా, వైసీపీలో బానిసలుగా పని చేస్తున్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. సర్వ నాశనం చేశారు. వైసీపీ పరిపాలనలో ఉత్తరాంధ్రను దోచుకున్నారు.
Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనకు 160 సీట్లు రావడం ఖాయం. ఇప్పుడు టీడీపీకి పవన్ కలిశారు. ఇక వైసీపీకి దబిడిదిబిడే. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని జగన్ చూస్తున్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి. లేదంటే ఏపీ ప్రజలకు బతుకు లేదు. ఈ ఎన్నికలు టీడీపీ, జగన్ మధ్య కాదు.. 5కోట్ల మంది ప్రజలకు, జగన్ కి మధ్య జరుగుతున్న ఎన్నికలివి” అని అచ్చెన్నాయుడు అన్నారు.
Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.