Kodali Nani : సచివాలయం తాకట్టు పెట్టారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు కొండాలి నాని స్ట్రాంగ్ కౌంటర్

ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలేనని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొండాలి నాని అన్నారు.

Kodali Nani

Kodali Nani Counter TO Chandrababu : సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడు.. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని నాని ప్రశ్నించారు. నేడు రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లు ఉంటే.. 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు.

Also Read : Bribery Cases : ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అనే విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాలకోసం ప్రభుత్వం వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందని నాని పేర్కొన్నారు. చిల్లర రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఆయన చేస్తే సంస్కారం.. మిగిలిన వారు చేస్తే విమర్శలా అంటూ కొడాలి నాని చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

 

 

ట్రెండింగ్ వార్తలు