×
Ad

Kodi Kathi Case : కోడికత్తి కేసులో ట్విస్ట్.. సీజేఐకి లేఖ రాసిన నిందితుడు శ్రీనివాస్

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తాను గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని...ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడు. ఇకనైనా విముక్తి కలిగించండి అంటూ వేడుకున్నాడు.

  • Published On : June 15, 2023 / 04:42 PM IST

Kodi Kathi Case Accused Srinivas Rao Wrote Letter To CJI

Kodi Kathi Case Twist : కోడికత్తి కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. వైఎస్ జగన్ (YS Jagan) పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో జైలు జీవితం గడుపతున్నాడు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ (Janupalli Srinivas). ఇప్పటికీ అతడికి బెయిల్ (Bail) రాలేదు. కోడికత్తి కేసుపై గురువారం విజయవాడ (Vijayawada) ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఎటువంటి కుట్ర లేదని విచారణ ముగించాలని ఎన్ఐఏ (NIA) దాఖలు చేసిన చార్జ్ షీటుపై వాదనలు జరిగాయి.

ఈ క్రమంలో నిందితుడు జన్నుపల్లి శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తనకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదని గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని… ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇకనైనా విముక్తి కలిగించండి అంటూ వేడుకున్నాడు. తనపై నమోదు అయిన కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలని కోరాడు. తనకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టుకు విన్నవించానని అయినా ఎటువంటి స్పందనా రాలేదని.. ఇటువంటి పరిస్థితుల్లో మీకు లేఖ రాస్తున్నానని పేర్కొన్నాడు.

Dr. Suresh Babu : టీడీపీలో చేరిన కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబు

కాగా.. 2018 అక్టోబర్ 25న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై శ్రీను కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అప్పటినుంచి జైలులోనే ఉన్నాడు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా బెయిల్ మాత్రం మంజూరు కాలేదు. దీంతో శ్రీను తనకు ఇకనైనా విముక్తి కలిగించాలని కోరుతు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు.

తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ గతంలో శ్రీను తల్లి సావిత్రమ్మ అప్పటి సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాసిన విషయాన్ని అతడి తరఫు న్యాయవాది అబ్దుస్ సలీం గుర్తు చేశారు. గతంలో శ్రీను రాసిన లేఖ తెలుగులో ఉన్నందున సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకే ఈ లేఖను ఇంగ్లీషులోకి అనువాదం చేసి పంపిస్తున్నామని తెలిపారు.

Sattenapalle Constituency: సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా లక్ష్మీనారాయణ వల్ల అవుతుందా?