షర్మిల నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.. నేను జనసేనలో చేరినట్టే లెక్క.. అంతేకాదు..: కొణతాల

ఉత్తరాంధ్ర నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తే చాలా మంచిదని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల తనను కాంగ్రెస్..

Pawan-Konathala

Konathala Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనకాపల్లిలో నిర్వహించనున్న బహిరంగసభ, ఉత్తరాంధ్ర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అనంతరం కొణతాల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర సమస్యలపై పవన్‌తో చర్చించామని చెప్పారు. ఉత్తరాంధ్రను దత్తత తీసుకోవాలని కోరానని తెలిపారు. అనకాపల్లిలో బహిరంగ సభ వచ్చేనెల 2 లేదా 4 తేదీల్లో ఉండొచ్చని అన్నారు.

తాను ఇప్పటికే జనసేనలో చేరినట్టేనని తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తే చాలా మంచిదని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. అయితే, తాను జనసేనలో చేరుతుండడం కాంగ్రెస్ పార్టీలోకి రాలేనని చెప్పానని తెలిపారు.

ఏపీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తానూ, షర్మిల వైసీపీలో ఉండాల్సిన వాళ్లమేనని, అయితే, తామే బయటకు వచ్చేశామంటే ఆ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వైసీపీ నుంచి అంతా బయటకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

శ్యాంబాబు గెటప్‌లోనే టీడీపీ-జనసేన తరపున ఎన్నికల ప్రచారం- నటుడు పృథ్వీరాజ్‌