ప్రాణం తీసిన సెల్ఫీ మోజు, అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

  • Published By: naveen ,Published On : September 14, 2020 / 11:15 AM IST
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు, అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

Updated On : September 14, 2020 / 2:31 PM IST

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు ప్రాణం తీసింది. అమెరికాలోని ఓ జలపాతం(వాటర్ ఫాల్స్)లో ప్రమాదవశాత్తు పడి తెలుగు యువతి చనిపోయింది. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

రెండో కుమార్తె కమల (26) గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లింది. అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేస్తోంది. ప్రస్తుతం కొలంబియాలో నివాసం ఉంటోంది. శనివారం బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం దగ్గర ఆగింది.

అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందింది. నాట్స్‌ సహకారంతో కమల మృతదేహాన్ని భారత్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
https://10tv.in/karnataka-3-priests-of-arkeshwara-temple-brutally-murdered-in-mandya-cash-looted/

కమల మృతితో గుడ్డవల్లేరులోని ఆమె ఇంట్లో విషాదం అలుముకుంది. కమల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఇలా జరుగుతుందని ఊహించలేదని గుండెలు బాదుకున్నారు.