KRMB : ఆ కేంద్రాలను బోర్డుకు అప్పగించాలి

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ లు వాటిపై ఉన్న కేంద్రాలను బోర్డుకు అప్పగించాలని కృష్ణా యాజమాన్య బోర్డు సూచించింది.

Krmb

Krishna River Management Board : కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ లు వాటిపై ఉన్న కేంద్రాలను బోర్డుకు అప్పగించాలని కృష్ణా యాజమాన్య బోర్డు సూచించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డుకు అప్పగిస్తే…అక్టోబర్ 14వ తేదీ నుంచి గెజిట్ ను అమలు చేయనున్నట్లు కేఆర్ఎంబీ వెల్లడించింది. 2021, అక్టోబర్ 12వ తేదీ మంగళవారం బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి బోర్డు అధికారులు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు హాజరయ్యారు. వారి వారి వాదనలు వినిపించారు. కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కోరడం జరిగిందని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ వెల్లడించారు. బోర్డు నుంచి ప్రతిపాదనలు వస్తే…ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలారావు వెల్లడించారు.

Read More : Request to PM Modi: ప్రధాని మోదీ నిర్మాత కావాలనే చివరి కోరికతో టీనేజర్ ఆత్మహత్య

సాగర్ పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించడం జరిగిందని, బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత కుమార్ వెల్లడించారు. 66 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయని తెలిపారు. కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్‌నోటిఫికేషన్‌ ఆపాలని కోరడం జరిగిందని, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకరావాలని ఏపీ కోరిందన్నారు. అయితే…దీనికి తాము అంగీకరించలేదని, విద్యుత్ ఉత్పత్తి అవసరమని తాము బోర్డు దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఈ విషయంలో తాము న్యాయసలహా అడగడం జరిగిందన్నారు.

Read More : YS Sharmila Bathukamma Song: వైఎస్ఆర్‌టీపీ తెలంగాణ పాట.. బతుకమ్మ పేర్చిన షర్మిల

దీనిపై ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ..విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకకపోతే తమకు అంగీకారం కాదని, శ్రీశైలం, సాగర్ కు సంబంధించిన అన్ని కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ..కేఆర్ఎంబీ తీర్మానం చేసిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బోర్డు నుంచి ప్రతిపాదనలు రాగానే..ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తుందని, తెలంగాణ ఇస్తుందో, లేదో తెలియదన్నారు.