Nara Lokesh Padayatra : నారా లోకేశ్ పాదయాత్రపై దాడులు చేయాలంటూ వైసీపీ నేత సోషల్ మీడియాలో మెసేజ్‌లు

సోషల్ మీడియాలో వైసీపీ మెసేజ్ లు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ‘యువగళం’పేరుతో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని పాదయాత్రపై దాడులు చేయాలి అంటూ కుప్పం నియోజవర్గంలో వైసీపీ నేత చేస్తున్న ఈ మెసేజ్ లు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి.

Nara Lokesh Padayatra

Nara Lokesh Padayatra : సోషల్ మీడియాలో వైసీపీ నేత మెసేజ్ లు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. ‘యువగళం’పేరుతో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలని పాదయాత్రపై దాడులు చేయాలి అంటూ రెచ్చగొట్టేలా  వైసీపీ కోదండరెడ్డి పేరుతో పెట్టిన మెసేజులు  కలకలం సృష్టిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను పాదయాత్ర జరగకూడదని మెసేజుల్లో రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. వైసీపీ పేరుతో వైరల్ గా మారిన ఈ మెసేజులు  ఇప్పటికే రాజకీయ సెగలు రగులుతున్న ఏపీలో మరింత హీట్ పుట్టిస్తున్నాయి.

పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకుని పాదయాత్రను ప్రారంభించటానికి టీడీపీ యత్నిస్తోంది. ఈ సమయంలో కుప్పం నియోజక వర్గం వైసీపీ నేత కోదండరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో నారా లోకేశ్ పాదయాత్రపై దాడులకు సిద్ధం కావాలి అంటూ వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాట్సాప్ గ్రూపుల్లో మెస్సేజ్ ల ద్వారా. ఇవి ఏపీలో రాజకీయంగా మరింత హీట్ పుట్టిస్తున్నాయి. తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో మెస్సేజ్ లను టీడీపీ బయటపెట్టింది.

‘యువగళం’పేరుతో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోంది. పాదయాత్ర ప్రారంభానికి అందుకే అనుమతులు ఇవ్వకుండా చేస్తోందా? అందుకేనా పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా కుట్ర చేస్తోంది? అంటే ఈ వాట్సాప్ మెసేజులు చూస్తే అవుననేలా ఉన్నాయి. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ జనవరి (2023)12న పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు కూడా టీడీపీ లేఖలు రాసింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరింది. కానీ ఇప్పటి వరకు పోలీసుల శాఖ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఇటువంటి సమయంలో కోర్టుకు వెళ్లి అయినా పాదయాత్రను ప్రారంభిస్తామని చెబుతోంది టీడీపీ.

ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవటానికి వైసీపీ శతవిధాలా యత్నిస్తోందని..శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసి అయినా పాదయాత్రపై వ్యతిరేకత వచ్చేలా చేయాలని వైసీపీ యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.కుప్పం నియోజక వర్గం వైసీపీ నేత కోదండరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో నారా లోకేశ్ పాదయాత్రపై దాడులకు సిద్ధం కావాలి అంటూ వైసీపీ కార్యకర్తలకు పిలుపునిస్తున్న ఈ మెస్సేజ్ లు. ఏపీలో మరింత కాకరేపుతున్నాయి.