×
Ad

Kurnool Bus Incident: కర్నూలు బస్సు కేసు.. వైసీపీకి పోలీసుల నోటీసులు..

ఇప్పటికే 27మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా పూడి శ్రీహరి పేరుని చేర్చారు.

Kurnool Bus Incident: కర్నూలు బస్సు దగ్ధం కేసులో వైసీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు నోటీసులిచ్చారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి పోలీసులు నోటీసులు అందజేశారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ మద్యం సేవించడమే కారణం అని వైసీపీ ప్రచారం చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ప్రచారం వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ కేసు నమోదు చేశారు. ఇప్పటికే 27మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా పూడి శ్రీహరి పేరుని చేర్చారు.