చెట్టుకి ఉరేసుకుని తహసీల్దార్ ఆత్మహత్య, కర్నూలు జిల్లాలో విషాదం

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు నిన్న(జూన్ 29,2020) ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు సమీపంలోని ముళ్లపొదల్లో ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. చెట్టుకు శవం వేలాడుతుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పాట్ కి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని చెట్టు నుంచి కిందకు దింపారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అసలేం జరిగింది?
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐడీ కార్డు ఆధారంగా మృతుడిని తహసీల్దార్ శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పగిడ్యాల మండలంలో తహసీల్దార్ గా పని చేస్తున్నా కర్నూలు బీ క్యాంపు లోని శ్రీనగర్ కాలనీలో శ్రీనివాసులు నివాసముంటున్నాడు. అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. శ్రీనివాసులు ఇంట్లో విషాదం అలుముకుంది. రెవెన్యూ శాఖకి చెందిన అధికారి ఇలా ఉరేసుకుని చనిపోవడం చర్చకు దారితీసింది. శ్రీనివాసులు ఆత్మహత్య మిస్టరీగా మారింది. త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు పోలీసులు.

Read:కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కన్నతండ్రి