Hindupur
labours stop Kachiguda Express train : అనంతపురం జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ లో కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును కార్మికులు, ప్రయాణికులు నిలిపి వేశారు. దీంతో కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్లే కాచిగూడ ఎక్స్ ఫ్రెస్ రైలు.. అరగంట నుంచి రైల్వే స్టేషన్ లో నిలిచిపోయింది. నెలసరి పాస్, సీజనల్ పాస్ తీసుకున్న వారిని రైలులో ఎక్కించుకోవడం లేదంటూ కార్మికులు, ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
ప్రతి రోజు హిందూపురం నుంచి గౌరీ బిందనూరు, దొడ్డభళాపుర్ కు ఉపాది నిమిత్తం సుమారు 100 మంది నుంచి 150 మంది కార్మికులు వెళ్తారు. సీజనల్ పాస్ మరియు మంత్లీ పాస్ తీసుకున్న రైల్లో పాస్ చెల్లదు అని రైల్వే అధికారులు 500 రూపాయలు ఫైన్ వేస్తున్నారంటూ కార్మికులు, ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రైలు ముందు భైటాయించి ఆందోళనకు దిగారు.