×
Ad

Lakshmi parvathi : చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారాహి కదులుతుంది : లక్ష్మీపార్వతి

పవన్ కళ్యాణ్ హీరోగా మంచి వ్యక్తి కానీ చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నాడు.టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

  • Published On : June 7, 2023 / 01:42 PM IST

lakshmi parvathi

Lakshmi parvathi : పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబుపై విమర్శలు చేశారు నందమూరి లక్ష్మీపార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు.. చంద్రబాబుపై ‘అల్లుడు సుద్దులు’ పుస్తకం రాశానని ఈ పుస్తకం త్వరలోనే విడుదల అవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి చంద్రబాబు హయాంలో అవినీతి మయం అయిందని విమర్శించారు. టీడీపీ అవినీతిమయం అయ్యింది కాబట్టే తను వ్యతిరేకిస్తున్నాను అని అన్నారు.

 

ఈ సందర్భంగా ఆమె జనసేన, టీడీపీ పొత్తులకు సానుకూలంగా ఉండటపై కూడా విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై పర్యటనకు సిద్ధమవుతున్న క్రమంలో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారాహి కదులుతుందని..అంత వరకు హైదరాబాద్ లో వుంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా మంచి వ్యక్తి కానీ చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

 

Lakshmi parvathi : చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదు

 

సీఎం కానప్పుడు పవన్ కళ్యాణ్ ను జనం కార్యకర్తలు ఎలా ఆదరిస్తారు? అని ప్రశ్నించారు. పార్టీ సింబల్ కూడా జనసేన కోల్పోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్నికల మానిఫెస్టో కి ఆర్బీఐ మొత్తం డబ్బు కూడా సరిపోదని..ఆర్ధిక సంస్కరణల విషయంలో ఎంతో మంది మన్మోహన్ సింగ్ లు కలిస్తే ఒక జగన్ అయ్యారంటూ జగన్ పై ప్రశంసలు కురిపించారు లక్ష్మీపార్వతి.