Lakshmi parvathi : చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదు

చ్చే ఏడాదికి జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖాయం అని అన్నారు లక్ష్మీపార్వతి. బీజేపీ టీడీపీ పొత్తులు కలుస్తాయని నేను అనుకోవటంలేదన్నారు.

Lakshmi parvathi :  చంద్రబాబు ప్రభుత్వం అక్రమాల వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదు

Lakshmi parvathi

Updated On : June 7, 2023 / 1:21 PM IST

Lakshmi parvathi : మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయం అంటూ నందమూరి లక్ష్మీపార్వతి ధీమా వ్యక్తంచేశారు. కర్ణాటక ఫలితాలు ముందుగా ఇచ్చిన ఇండియా టు డే త్వరలో జగన్ ఎపి సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారని అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి చంద్రబాబుపైనా, ఆయన పాలనపైనా మరోసారి విమర్శలు సంధించారు. చంద్రబాబు ప్రభుత్వ అక్రమాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరిగిందని..నిర్మాణ వ్యయం కూడా చంద్రబాబు పాలన వల్లేనంటూ ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాదికి జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖాయం అని అన్నారు.

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ పొత్తుల కోసమేనని..కానీ బీజేపీ టీడీపీ పొత్తులు కలుస్తాయని నేను అనుకోవటంలేదన్నారు. అదే గనుక నిజంగా జరిగే అవకాశం ఉంటే ఇప్పటికే పచ్చ మీడియా ప్రచారం చేసి వుండేదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు వాజ్ పాయ్ కాలం నుంచి బీజేపీ నీ మోసం చేస్తున్నారంటూ విమర్శించారు.

 

వ్యక్తి గత విమర్శలు చేయడంలో చంద్రబాబు..లోకేష్ ఒకటే నన్నారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు..లోకేష్ లు ఎన్నిసార్లు ఇంట్లో గొడవలు పడ్డారో నాకు తెలుసన్నారు. సిగ్గు..అభిమానం..అవమానం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ దుయ్యబట్టారు. తిరుపతి వచ్చినప్పుడు అమిత్ షా పై రాళ్లు వేసిన చంద్రబాబు ఎలా ఇప్పుడు బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారు? అంటూ ప్రశ్నించారు.చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టోకి ఆర్బీఐ మొత్తం డబ్బు కూడా సరిపోదంటూ ఎద్దేవా చేశారు.