Lance Naik Sai Teja : ఢిల్లీ నుంచి కోయంబత్తూరు మీదుగా స్వగ్రామానికి అమరుడు సాయితేజ భౌతిక కాయం

లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం నేడు స్వగ్రామానికి చేరుకోనుంది. కోయంబత్తూరు మీదుగా బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి తీసుకొస్తారు.

Lance Naik Sai Teja : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం నేడు స్వగ్రామానికి చేరుకోనుంది. కోయంబత్తూరు మీదుగా బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామానికి తీసుకొస్తారు.

భౌతికకాయం బెంగళూరుకు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేరుకుంటుంది. కాగా అధికారులు డీఎన్ఏ పరీక్ష ద్వారా సాయితేజ మృతదేహం గుర్తించారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కోయంబత్తూరు ఎయిర్ బేస్ కి చేరుకుంటుంది. అక్కడి నుంచి బెంగళూరు.. మీదుగా స్వగ్రామానికి తరలించనున్నారు.

చదవండి : Lance Naik Sai Teja: అమరుడు సాయితేజ మృతదేహం కోసం ఎదురుచూపులు

సాయితేజ భౌతిక కాయం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు రెండు రోజులుగా వేచిచూస్తున్నారు. శుక్రవారమే రావాల్సి ఉండగా.. మృతదేహం గుర్తించలేని స్థితిలో ఉండటంతో డీఎన్ఏ పరీక్ష చేయాల్సి రావడంతో ఆలస్యమైంది.

ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక సాయితేజ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. ప్రభుత్వం తరపున రూ.50 లక్షలు ప్రకటించారు. ఆ చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు అందించారు.

చదవండి : Bipin Rawat Funerals : సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి

 

ట్రెండింగ్ వార్తలు