Seediri Appalaraju : చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు, మళ్లీ గెలవరు- మంత్రి సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju : అని రంగాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు ఓ సైకో.

Seediri Appalaraju

Seediri Appalaraju – Chandrababu Naidu : ఏపీలో రాజకీయం వేడెక్కింది. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మాటలతో మంట పుట్టిస్తున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అని, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ గెలవరు అని మంత్రి సీదిరి అప్పలరాజు జోస్యం చెప్పారు.

” ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతున్నారు. చంద్రబాబు హయాంలో మహిళలపై జరిగిన దాడులు మనం చూశాం. కాల్ మనీ, జన్మభూమి కమిటీల పేరుతో దాడులు చేశారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ప్రభుత్వం మీద రుద్దేయాలని చంద్రబాబు చూస్తున్నారు. రాష్ట్రంలో విజనరీ ఎవరు? సైకో ఎవరు? ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఈరోజు అన్ని వ్యవస్థల్లో మార్పు తెచ్చిన విజనరీ జగన్. అని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన సైకో చంద్రబాబు.

Also Read..Eluru Constituency: ఏలూరులో వైసీపీ టికెట్ ఆయనకేనా.. జనసేనకు ఏలూరు పట్టం కడుతుందా.. టీడీపీ పరిస్థితేంటి?

సచివాలయం వ్యవస్థతో ప్రజల ముందుకు పాలన తెచ్చారు జగన్. జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని దోచేశారు చంద్రబాబు. అని రంగాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు ఓ సైకో. పారదర్శకంగా, నిజాయితీగా పాలన చేస్తున్న వ్యక్తి జగన్. మాయమాటలు చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు. మళ్ళీ చంద్రబాబు గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదు” అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

Also Read..Pawan Kalyan : ముస్లింలతో సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు