Tirumala Leopard : తిరుమలలో చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు

తిరుమలలో చిరుత పులి సంచారం కలవరపెడుతోంది. ఘాట్ రోడ్ లో చిరుత కనిపించినట్లు భక్తులు చెబుతున్నారు.

Tirumala Leopard : పవిత్ర పుణక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. చిరుత పులి కనిపించడం ఆందోళన నింపింది. తిరుమల ఘాట్ రోడ్ లో చిరుత పులి సంచారం కలవరపెడుతోంది. గాలి గోపురం సమీపంలోని మొదటి ఘాట్ రోడ్ లోని చెట్ల పొదల్లో చిరుత కనిపించినట్లు భక్తులు చెబుతున్నారు. కొందరు భక్తులు చిరుతను తమ సెల్ ఫోన్ కెమెరాలో చిత్రీకరించారు. వాహనదారులను గమనించిన చిరుత.. పొదల్లోంచి మరింత లోపలికి వెళ్లిపోయింది. చిరుతను కళ్లారా చూసిన అటుగా వెళ్తున్న వాహనదారులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని టీటీడీ భద్రతా సిబ్బందికి తెలిపారు. చిరుత సంచారంతో భక్తుల్లో టెన్షన్ నెలకొంది.

తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. భక్తులతో తిరుమలగిరులు కిక్కిరిసిపోతాయి. అయితే, ఘాట్ రోడ్ లో చిరుతపులి కనిపించిందనే వార్త భక్తుల్లో ఆందోళన నింపింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని, చిరుత ఎక్కడ దాడి చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.

Also Read..‘Bijli Mahadev’ Shivling : ‘పిడుగుల పరమేశ్వరుడి’ ఆలయం విశిష్టత..ప్రతీ ఏటా పిడుగు పడి ముక్కలై అతుక్కునే శివలింగం

మొదటి కనుమ దారిలో 35వ మలుపు దగ్గర చిరుతపులి కనిపించడంతో తిరుపతికి వెళుతున్న వాహనదారులు హడలిపోయారు. కొందరు వాహనదారులు చిరుత సంచరిస్తున్న విషయాన్ని టీటీడీకి సమాచారం అందించారు. దాంతో టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతపులిని తిరిగి అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read..Maha Shivratri 2023: శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం..ఇక్కడ జోలెపట్టి అడిగితే కష్టాలు తీర్చే ‘రామలింగేశ్వరుడు’..

తిరుమల శేషాచల అడవుల్లో పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి. కరోనా సంక్షోభం సమయంలో లాక్ డౌన్ విధించగా, జనసంచారం లేని తిరుమల కొండపై చిరుతలు, ఎలుగుబంట్లు వంటి జంతువులు యధేచ్ఛగా తిరిగాయి. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేశాక భక్తుల రద్దీ పెరిగింది. దీంతో వన్యప్రాణులు కొండపై కనిపించడం తగ్గింది. అప్పుడప్పుడు కొన్ని వన్యప్రాణులు ఇలా కనిపించి భక్తులను బెంబేలెత్తిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు