‘Bijli Mahadev’ Shivling : ‘పిడుగుల పరమేశ్వరుడి’ ఆలయం విశిష్టత..ప్రతీ ఏటా పిడుగు పడి ముక్కలై అతుక్కునే శివలింగం

ఆ దేవాలయంలో శివలింగం ప్రతీ ఏటా పిడుగు పడుతుంది. పిడుగు పాటుకు ఆ శివలింగం ముక్కలైపోతుంది. కానీ కొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ శివలింగం మామూలు లింగంలా మారిపోతుంది.ఈ అద్భుతమైన ఆలయం ప్రత్యేకలు అన్నీ ఇన్నీ కావు. ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ పిడుగుల పరమేశ్వరుడి ఆలయం విశేషాలు మీకోసం..

‘Bijli Mahadev’ Shivling : ‘పిడుగుల పరమేశ్వరుడి’ ఆలయం విశిష్టత..ప్రతీ ఏటా పిడుగు పడి ముక్కలై అతుక్కునే శివలింగం

‘Bijli mahadev’ shivling

‘Bijli mahadev’ shivling : తన విలయ తాండవంతో ప్రకృతినే గడగడలాడించే పరమశివుడికి పిడుగులు ఓ లెక్క కాదు. పరమశివుడు తాండవం చేస్తే భూ భువనాలు కంపించిపోతాయి. ఆకాశంలో ఉరుమలు..మెరుపులు తళతళలాడతాయి. పిడుగులు పడతాయి. అటువంటి శివయ్యమీదనే గురి చూసినట్లు..అదేదో మహత్కార్యంగా పిడుగు పడుతుంది. హిమాచల్ ప్రదేశ్‌ లోని ఎత్తైన హిమగిరుల్లో.. ప్రకృతి అందాల మధ్య కొలువైన ‘బిజిలీ మహాదేవ్’ ఆలయంలో ఉన్న శివలింగంపై ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా పిడుగు పడుతుంది. ఆ పిడుగు ధాటికి శివలింగం ముక్కలైపోతుంది. కానీ కొన్ని రోజులే విచిత్రంగా ముక్కలైపోయిన శివలింగం ఒక్కటైపోతుంది. సాధారణ శివలింగంలా మారిపోతుంది. ఇదంతా ఆ పరమశివుడు మహత్యం అనేలా ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఈ పిడుగుపాటు పరంపర కొనసాగుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కులు-మనాలి. ఆ కులుకు 22 కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ మహత్యాల ‘బిజిలీ మహాదేవ్’ ఆలయం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే మూడు కిలో మీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సిందే.‘బిజిలీ మహాదేవ్’ ఆలయంలో ఏడాదికి ఒకసారైన పిడుగు పడుతుంది. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఆ పడే పిడుగు కూడా ఏమాత్రం గురి తప్పనట్లుగా డైరెక్టుగా శివలింగం పైనే పడుతుంది. దీంతో శివలింగం చీలిపోయి ముక్కలైపోతుంది. అలా ముక్కలైపోయిన శివలింగాన్ని ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒకచోటకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్లీ యథాస్థితికి మారిపోతుంది. కనీసం పగుళ్లు కూడా కనిపించవు. అక్కడ పిడుగు పడిన దాఖలాలే కనిపించవు. అందుకే ఇక్కడ శివయ్యను పిడుగుల శివయ్య అని పిలుస్తారు భక్తులు..

Maha Shivratri 2023: శివలింగంపై రామబాణం గుర్తున్న అరుదైన ఆలయం..ఇక్కడ జోలెపట్టి అడిగితే కష్టాలు తీర్చే ‘రామలింగేశ్వరుడు’..

ఈ శివలింగంపై ప్రతీ ఏటా పిడుగుపాటుకు గురికావడం వల్ల ఈ ఆలయానికి ‘బిజిలీ మహాదేవ్’ అని పేరు వచ్చింది. హిందీలో బిజీలీ అంటే విద్యుత్ లేదా పిడుగు. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజలను, జంతువులను రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటును తనమీదకు రప్పించుకుంటాడని స్థానికులు నమ్ముతారు.

పిడుగు పాటుకు విరిగిన శివలింగం మళ్లీ తిరిగి అతుక్కోవటానికి గల కారణం గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కానీ సరైన సమాధానం తెలుసుకోలేకపోయారు. సాధారణంగా పిడుగు పడితే రాయి ముక్కలైపోయి చెల్లా చెదురవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తిస్థాయిలో అంటుకోదు. కానీ ఈ బిజిలి శివయ్యకు పూజర్లు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుంది?అనేది మాత్రం అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఏది ఏమైనా ఇది ఆ శివయ్య మహిమేనంటారు భక్తులు.

Mahashivratri : పార్వతిదేవి ఒడిలో పడుకున్న పరమశివుడు .. పళ్లికొండేశ్వర దేవాలయం విశిష్టతలు

ఈ పిడుగుల శివాలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కుల్లు, పార్వతీ వ్యాలీ అందాలు చూసి తీరాలే తప్ప మాటల్లో చెప్పలేం. కళ్లు తిప్పుకోలేని ప్రకృతిశోభతో కనువిందు చేస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పిడుగుల శివయ్యను దర్శించుకోవటానికి భక్తులు శివరాత్రి రోజున భారీగా తరలివస్తారు. డిసెంబరు, జనవరి (శీతాకాలం)నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. దీంతో ఆలయాన్ని మూసివేస్తారు నిర్వాహకులు. ఈ పిడుగుల పరమేశ్వరుడి దేవాలయం చిన్నదే కానీ మహిమలగల ఆలయం..

Mahashivratri..Rudraksha : పరమశివుడి ప్రత్యక్ష రూపాలు రుద్రాక్షలు..ఏ రుద్రాక్ష ఏ దేవతాస్వరూపమో తెలుసా?