Mahashivratri : పార్వతిదేవి ఒడిలో పడుకున్న పరమశివుడు .. పళ్లికొండేశ్వర దేవాలయం విశిష్టతలు

పార్వతిదేవి ఒడిలో పడుకున్న పరమశివుడు ఈ ఆలయంలో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యం. అదే పళ్లికొండేశ్వర దేవాలయం. పార్వతీదేవి ఒడిలో సేదతీరుతున్న శివయ్య దేవాలయం విశిష్టతలు ఎన్నో..ఎన్నెన్నో..

Mahashivratri : పార్వతిదేవి ఒడిలో పడుకున్న పరమశివుడు .. పళ్లికొండేశ్వర దేవాలయం విశిష్టతలు

pallikondeswara temple Special In surutapalli

Mahashivratri : పశుపతి అంటే పశువులకు అధిపతి. అంటే సాక్షాత్తు పరమశివుడు. పాశం అంటే తాడు. దానితో కట్టబడి ఉన్నదాన్ని పశువు అంటారు.పశువులకు అధిపతి పశుపతి నాధుడు. అంటే శివుడు. మానవులకు దుక్కిదున్ని పంటలు పడించే పశువుని (ఎద్దు,నంది)ని వాహనంగా ధరించినవాడు. ఎన్నో నామాలు కలిగిన శివయ్య భక్తులు ఏపేరుతో పిలిచినా పలుకుతాడు. ఉద్దరితో కాసిన్ని నీళ్లు చల్లితే కోరిన కోరికలు తీర్చే భోళా శంకరుడు.భారత దేశ వ్యాప్తంగా శివయ్యకు ఎన్నో దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కోపేరుతో పూజలందుకుంటున్నాడు చంద్రశేఖరుడు. చంద్రవంకను శిగలో ధరించి చంద్రశేఖరుడు అయ్యాడు ఈశ్వరుడు. అటువంటి శివుడు ఎక్కువ శాతం దేవాలయాల్లో లింగాకారంలోనే దర్శమిస్తాడు. లింగాకారంలోనే అభిషేకాలు పొందుతాడు. అటువంటి శివుడు విగ్రహం రూపంలో కనిపించే ఆలయంలో బహు తక్కువగా ఉంటాయి.

అటువంటి దేవాలయాల్లో పళ్లికొండేశ్వర దేవాలయం ఒకటి. ఈ దేవాలయానికి ఉండే మరో అత్యంత అరుదైన,అద్భుతమైన ప్రత్యేకత మరొకటి ఉంది. ఈ దేవాలయంలో పార్వతీదేవి ఒడిలో పడుకుని దర్శమిస్తాడు శివుడు. పళ్లికొండేశ్వర దేవాలయం ప్రత్యేకత అదే. ఆలయంలోని గర్భగుడిలో.. పార్వతీ దేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న స్థితిలో శివుడి విగ్రహం కనిపిస్తుంది. ఆ తీరులో ఉన్న శివయ్యను..ఆ ఆదిశక్తిని అలా చూస్తుండిపోవాలనిపించే అత్యంత అద్భుతంగా దర్శమిస్తారు ఆదిదంపతులు..

Mahashivratri..Rudraksha : పరమశివుడి ప్రత్యక్ష రూపాలు రుద్రాక్షలు..ఏ రుద్రాక్ష ఏ దేవతాస్వరూపమో తెలుసా?

శివాలయాల్లో ఎక్కడైనా శివుడు మనకు లింగాకారంలో మాత్రమే కనిపిస్తాడు. కానీ ఈ పళ్లికొండేశ్వర దేవాలయంలో మాత్రం శివుడు ఇలా మానవరూపంలో కనిపించడం ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఈ పళ్లికొండేశ్వర దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఆంధ్రప్రదేశ్ చివరిలో ఉండే సురుటిపల్లి గ్రామం నుంచి ఒకటిన్నర కిలోమీటరు వెళ్తే తమిళనాడు వస్తుందనగా రోడ్డు పక్కనే ఆ ఆలయం కనిపిస్తుంది. తమిళనాడులో మొదట వచ్చే ఊతుకోట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయంలోని శివుడి పళ్లికొండేశ్వరుడు పేరుతో పూజలందుకుంటున్నాడు. పళ్లికొండు అంటే తమిళంలో పడుకోవడం అని అర్థం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం ఇది.

1334లో హరిహరబుగ్గ రాయల కాలంలో స్థాపించిన ఈ శివాలయంలో 12 ఏళ్లకోసారి కుంభాభిషేకం జరుగుతుంది. ఈ గుడిలో పార్వతీ అమ్మవారి పేరు సర్వమంగళా దేవి. ఈ ఆలయంలో స్వామి, అమ్మవారి మధ్యలో దక్షిణామూర్తి ధర్మపత్నీ సమేతంగా ఉండడం మరో అత్యంత విశేషం. శివుడు పార్వతీ దేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఈ ఆలయంలో ఉన్న రూపం వేరే ఎక్కడా లేదు. శివుడు అమ్మవారి తొడ మీద విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా దర్శనమిస్తారు. శివుడు లింగం ఆకారంలో కాకుండా మూర్తి స్వరూపంగా ఉండే శైవ క్షేత్రం ఇది.పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన హాలాహలాన్ని లోక కళ్యాణం కోసం స్వీకరించిన శివుడు ఆ గరళాన్ని గొంతులోనే బంధించాడు. అందుకే స్వామిని గరళకంఠుడు అని కూడా అంటారు. ఈ దేవాలయంలో శివుడు అమ్మవారి ఒడిలో పడుకుని విశ్రాంతి తీసుకుంటాడు. శివుడు పవళించి ఉండడం వల్లే ఆయనకు పళ్లికొండేశ్వర అనే పేరు వచ్చిందని ఆలయ అర్చకులు చెబుతుంటారు.

Mahashivratri 2023 : శివుడికి ఇష్టమైన ద్రవ్యాలు..ఐశ్వర్యపాప్తి కలిగించే అభిషేకాలివే..

శివుడు హాలాహలాన్ని తాగిన తర్వాత..అది కడుపులోకి పోకుండా ఉండటానికి ఆ ఆదిపరాశక్తి మంగళాదేవి రూపంలో ఇక్కడ అవతరించి భర్త శివయ్యకు కంఠాన్ని తన స్వహస్తాలతో సేదతీర్చారట. దాంతో హాలాహలం ఆయన ఉదరం (కడుపు)లోకి దిగకుండా కంఠంలోనే నిలిచిపోయి..నీలంగా మారింది. అందుకే ఇక్కడి స్వామివారికి నీలకంఠేశ్వరుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. పరమశివుడికి లోకకల్యాణం ఎంత ముఖ్యమో భర్తకు భార్య ఎంత ముఖ్యమో చెప్పే తత్వం ఇదంటారు. అందుకే అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలను ఆదిదంపతులు అంటారు. అంటే శివపార్వతులు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి 60 కి.మీ, శ్రీకాళహస్తి నుంచి 60 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.