Live Fish Stuck In Fisherman Throat : అరెరే పాపం..! వలలో నుంచి ఎగిరి నోట్లోకి దూరిన చేప.. గొంతులో ఇరుక్కొని నరకయాతన.. వైద్యుల వద్దకెళ్తే..
Live Fish Stuck In Fisherman Throat : ప్రకాశం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. చేపల వల తీస్తుండగా.. ఓ చేప పిల్ల ఎగిరి మత్స్యకారుడి నోట్లోకి దూరింది. దీంతో ఆ మత్స్యకారుడు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు.
- Harishth Thanniru
- Published On : March 13, 2026 / 11:12 AM IST
Live Fish Stuck In Fisherman Throat
Live Fish Stuck In Fisherman Throat : చేప ముక్క తింటుంటే అనుకోకుండా దాని ముల్లు గొంతులో ఇరుక్కుపోతేనే చాలా ఇబ్బంది పడతాం.. అదే బతికున్న చేపపిల్ల గొంతులో ఇరుక్కుపోతే.. ఇక ఆ నరకయాతన భరించలేం. ఇదే ఘటన ఓ మత్స్యకారుడికి ఎదురైంది. గొంతులో చేప పిల్ల ఇరుక్కుపోవడంతో నరకం అనుభవించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గొంతులో ఇరుక్కుపోయిన ఆ చిప పిల్ల బయటకు రాకపోవడంతో.. వైద్యులు వద్దకు వెళ్లాడు.. వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి గొంతులో ఇరుక్కుపోయిన చేప పిల్లను బయటకు తీశారు. దీంతో ఆ మత్స్యకారుడు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
Also Read : Gold Price Today : బంగారం ధర ఢమాల్.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గుదల.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సుబ్రహ్మణ్యం చేపల వేటకు వెళ్లారు. ఆయన వలకు కొన్ని చేపలు చిక్కాయి. వాటిని బయటకు తీసేందుకు వలను పైకిలాగాడు. చేపలను తీసే క్రమంలో వలను నోటితో పట్టుకొని చేపలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సమయంలో ఓ చిన్న చేపపిల్ల ఎగురుకుంటూ వచ్చి సుబ్రహ్మణ్యం నోట్లోకి దూరింది. దానిని తీసేలోపు గొంతులోకి వెళ్లింది.. చేప అలా ఇరుక్కోవడంతో బాధితుడు ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు.
గొంతులో ఇరుక్కుపోయిన చేప పిల్లను తీసేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి. దీంతో నొప్పి తీవ్రం కావడంతో స్థానికులు సుబ్రహ్మణ్యంను ఒంగోలులోని జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు చేప గొంతులోనే ఉందని గుర్తించారు.
ఒంగోలు జీజీహెచ్ ఈఎన్టీ విభాగం హెచ్‌వోడి డాక్టర్ ప్రభాకర్, మిగిలిన డాక్టర్లు కలిసి ట్రాకియాక్టమి పద్దతిలో గంటకుపైగా సమయంలో సర్జరీ చేసి గొంతులో ఇరుక్కుపోయిన చేప పిల్లను బయటకు తీశారు. దీంతో సుబ్రహ్మణ్యం, అతని కుటుంబ సభ్యులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుం సుబ్రహ్మణ్యంకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
