×
Ad

Visakhapatnam : ఏపీలోని పెదగంట్యాడలో టెన్షన్ టెన్షన్.. నిర్వాసితులు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం.. కుర్చీలు విసిరికొట్టి ఆందోళన

Visakhapatnam : విశాఖపట్టణంలోని పెదగంట్యాడ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు

Visakhapatnam

Visakhapatnam : విశాఖపట్టణం (Visakhapatnam) లోని పెదగంట్యాడ (Pedagantyada) గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్న పలు గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న అన్ని గ్రామాల ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు అక్కడకు చేరుకున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బుధవారం పెదగంట్యాడలో పబ్లిక్ హియరింగ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు స్థానిక ప్రజలు హాజరయ్యారు. సిమెంట్ ఫ్యాక్టరీతో స్థానికంగా ఉండే తమకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆందోళనకు దిగారు. గో బ్యాక్ అంటూ సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక ప్రజల ఆందోళనతో పబ్లిక్ హెయరింగ్ సభా ప్రాంగణం దద్దరిల్లింది. సభా ప్రాంగణం వద్దకు పెద్దెత్తున ఆందోళనకారులు చేరుకొని కుర్చీలను విసిరికొట్టారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ పెద్దెత్తున స్థానికులు నిరసనకు దిగారు.

Also Read: Uttar Pradesh: నా భార్య రాత్రిపూట పాముగా మారి నన్ను కాటేయడానికి ప్రయత్నిస్తుంది.. భర్త వింత ఫిర్యాదు.. అధికారులు ఏం చేశారంటే..

ప్రజాభిప్రాయ సేకరణ సభా ప్రాంగణం వద్ద స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కుర్చీలు, బారికేడ్లు ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిర్వాసితులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, స్థానికులు మాత్రం మా ప్రాంతానికి వచ్చి మామీదే కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.