Uttar Pradesh: నా భార్య రాత్రిపూట పాముగా మారి నన్ను కాటేయడానికి ప్రయత్నిస్తుంది.. భర్త వింత ఫిర్యాదు.. అధికారులు ఏం చేశారంటే..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు, పోలీసులను ఓ వింత ఫిర్యాదు ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వ్యక్తి తన భార్యపై ఫిర్యాదు చేశాడు.

Uttar Pradesh: నా భార్య రాత్రిపూట పాముగా మారి నన్ను కాటేయడానికి ప్రయత్నిస్తుంది.. భర్త వింత ఫిర్యాదు.. అధికారులు ఏం చేశారంటే..

Uttar Pradesh

Updated On : October 8, 2025 / 11:42 AM IST

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు, పోలీసులను ఓ వింత ఫిర్యాదు ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య రాత్రి వేళల్లో పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన యూపీలోని సీతాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రజా ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రజలు సాధారణంగా విద్యుత్, రోడ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు తమ విజ్ఞప్తులు చేస్తుంటారు. అయితే, మహమూదాబాద్ ప్రాంతంలోని లోధ్సా గ్రామానికి చెందిన మెరాజ్ అనే వ్యక్తి ‘సార్.. నా భార్య నసీమున్ రాత్రిపూట పాముగా మారిన నన్ను కాటు వేయడానికి నా వెంట పరుగెత్తుతుంది’ అంటూ ఫిర్యాదు చేశాడు.

Also Read: Prithvi Shaw : వార్నీ.. నువ్వు మారవా బ్రో.. మైదానంలో పృథ్వీషా రచ్చరచ్చ.. సహచరుడిపై బ్యాటుతో దాడికి యత్నం.. వీడియో వైరల్..

నా భార్య నన్ను చంపడానికి చాలాసార్లు ప్రయత్నించిందని, కానీ, ప్రతిసారీ నేను సరైన సమయంలో మేల్కొంటూ ఆమె దాడి నుంచి తప్పించుకుంటున్నానని మెరాజ్ పేర్కొన్నాడు. నా భార్య నన్ను మానసికంగా హింసిస్తుంది. నేను నిద్రపోతున్న సమయంలో ఏ రాత్రి అయినా నన్ను చంపవచ్చునని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

ఓ నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు కూడా కోబ్రాలా మారాలి అంటూ వ్యాఖ్యానించాడు.. మరొక నెటిజన్.. ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అతను తన వివాహ జీవితంలో శ్రీదేవిని కనుగొన్నాడు.. ఓ సినిమాలో దివంగత నటి శ్రీదేవి పాముగా మారే చిత్రాన్ని ప్రస్తావిస్తూ చమత్కరించాడు.

ఇదిలాఉంటే.. మెరాజ్ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని సబ్ డివిజనల్ అధికారి, పోలీసులను ఆదేశించారు. అయితే, పోలీసులు మానసిక వేధింపుల కేసుగా ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అతని భార్య ఇప్పటికే ఒకసారి అతన్ని కరిచింది.. పాముగా మారిన తరువాత రాత్రిపూట తరచుగా అతన్ని వెంబడించేది.