×
Ad

ఢిల్లీ టూర్లతో లోకేశ్‌కు ఫ్యూచర్‌ లీడర్‌గా ఎలివేషన్.. బీజేపీ పెద్దలకు ఎందుకు దగ్గరవుతున్నట్లు?

సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ.. లోకేశ్‌ ఇప్పుడే ఫుల్ యాక్టీవ్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Nara Lokesh

Nara Lokesh: ప్రభుత్వంలో అయినా..పార్టీలో అయినా..ఈవెంట్‌ మరేదైనా..ఆయనే హైలైట్. ఓవైపు మంత్రిగా..మరోవైపు టీడీపీ కీలక నేతగా లోకేశ్‌ చుట్టే చర్చ జరుగుతోంది. ఓ వైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్..మరోవైపు రాజకీయ సంప్రదింపులు..అన్నింట్లో లైమ్‌లైట్‌లో ఉంటున్నారు.

ఇదే టైమ్‌లో లోకేశ్‌ ఢిల్లీ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. ఈ 15నెలల కాలంలో ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సహా, కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌తో పాటు పలువుర్ని కలిశారు. (Nara Lokesh)

ఇప్పుడు మరోసారి సీఎం చంద్రబాబుతో కలిసి హస్తినకు వెళ్లిన లోకేశ్..ఎయిర్ బస్‌ ప్రతినిధులతో భేటీ అయి చర్చించారు. సెంట్రల్ మినిస్టర్లను కూడా కలుస్తారని అంటున్నారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేశ్‌ ఢిల్లీలో ఉండటం..రాజకీయంగా ఇంట్రెస్టింగ్‌గా మారింది. టీడీపీ ఫ్యూచర్‌ లీడర్‌గా ఎస్టాబ్లిస్‌ అవుతూ వస్తోన్న లోకేశ్‌.. కేంద్ర పెద్దలతోనే మంచి రిలేషన్స్ మెయింటెన్ చేస్తున్నారు.

బీజేపీ అ్రగనేతలుగా ఉన్నా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులతో ర్యాపో పెంచుకుంటున్నారు. యువనేతగా, ఏపీ మంత్రిగా..చంద్రబాబు వారసుడిగా రాజకీయంగా భవిష్యత్‌ ఉన్న లీడర్‌గా లోకేశ్‌కు ఢిల్లీలో ప్రాధాన్యత పెరుగుకుంటూ వస్తోంది. ప్రధాని మోదీ ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ లోకేశ్‌కు చెప్పారంటే ఆయనకు ఏ రేంజ్‌లో ప్రాధాన్యత దక్కుతుందో చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: దగ్గు మందు తాగి ఇద్దరు పిల్లలు మృతి.. అదేం లేదు.. నేను తాగుతా అని తాగిన డాక్టర్.. కట్ చేస్తే..

చంద్రబాబు తర్వాత టీడీపీలో అంతటి నేతగా లోకేశ్‌ పాపులారిటీ పెంచుకుంటున్నారు. పైగా ప్రతీ విషయానికి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లలేరు కాబట్టి..లోకేశే అన్నీ తానై పరిస్థితులను చక్కబెడుతున్నారట. కేంద్రం, ఏపీ మధ్య అడ్మినిస్ట్రేషన్‌ పరంగా..రాజకీయ సంబంధాల పరంగా కోఆర్డినేషన్‌ మిస్‌ కాకుండా..కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారట లోకేశ్. నేషనల్ పాలిటిక్స్‌లో చంద్రబాబు వెల్‌ నౌన్‌ పొలిటీషియన్. 20ఏళ్ల క్రితమే ఎన్డీయేలో కీలకంగా వ్యహరించిన నేత.

అలా రాజకీయంగా చంద్రబాబు ఎన్నో హైట్స్‌ చూశారు. ఇక చంద్రబాబు తర్వాత టీడీపీ రథసారధి ఎవరంటే క్యాడర్ లీడర్లు టక్కున చెప్పే మాట లోకేశ్ అని. అలా చిన్నబాబు కూడా తన మార్క్ నిర్ణయాలు, పార్టీ బలోపేతం వంటి డెసిషన్స్‌తో ఆయన మార్క్ ఏంటో చూపిస్తున్నారు. భవిష్యత్‌ లీడర్‌గా లోకేశ్‌ ఆల్రెడీ ఎలివేట్‌ అయిపోయారు.

ఫ్యూచర్‌కు బలమైన పునాదులు

ఈ క్రమంలో ఎక్కడా ఎక్స్‌పోజ్‌ కాకుండా ఫ్యూచర్‌కు బలమైన పునాదులు వేసుకుంటున్నారట లోకేశ్. ఫ్యూచర్ పాలిటిక్స్‌లో కింగ్‌ మేకర్‌గా..కీరోల్ ప్లే చేసేంత పట్టు ఉండాలంటే బీజేపీ పెద్దలతో ఎంత మంచి సంబంధాలుంటే అంత బెటర్ అని భావిస్తున్నారట. టీడీపీ కేంద్రంలో ఎప్పుడూ బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటుంది. బీజేపీకి కూడా టీడీపీ అవసరం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌ వరుసగా హస్తిన పర్యటనలు చేస్తున్నారని..కేంద్ర పెద్దలతో బంధం మరింత బలపడేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు.

సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ.. లోకేశ్‌ ఇప్పుడే ఫుల్ యాక్టీవ్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలపై పట్టు పెంచుకోవడంతో పాటు..కేంద్రం పెద్దలతో పొలిటికల్ లాబీయింగ్‌ కూడా చేస్తున్నారట. మోదీ ఎప్పుడు ఏపీకి వచ్చినా..లోకేశ్‌ని ఢిల్లీ వచ్చి కలవమంటూ ప్రత్యేకంగా చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో డిన్నర్ సమావేశంలో పాల్గొన్నారు లోకేశ్‌.

ఈ ఏడాది జూన్‌లో ఒకసారి, ఆగస్ట్‌లో మరోసారి ఢిల్లీవెళ్లి వరుస పెట్టి కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పనులపై రిక్వెస్ట్‌లు పెట్టారు. లోకేశ్‌ అడిగిందే లేట్‌ అన్నట్లుగా కేంద్ర మంత్రులు..ఆయన విజ్ఞప్తులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారట. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే ఢిల్లీ పెద్దలకు దగ్గరైన లోకేశ్‌..ఎప్పటికప్పుడు ఏపీ పొలిటికల్ సిచ్యువేషన్‌, కూటమి వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తున్నారట. కేంద్ర పెద్దలతో లోకేశ్‌ భేటీల వెనుక ఫ్యూచర్‌ ప్లాన్ అయితే పక్కా ఉండే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.