AP Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, భీకర గాలులు.. హెచ్చరికలు జారీ

AP Rains Alert : ఏపీలోని వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

Andhra pradesh weather update

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

AP Rains Alert : ఏపీలోని వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భీకర గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా వాతావరణ శాఖ ఏపీలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Also Read : Tirupati-Karimnagar Express: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. కరీంనగర్-తిరుపతి రైలు సమయాల్లో మార్పు.. పూర్తి డీటెయిల్స్ ఇవే

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురంలతో పాటు రాయలసీమ ప్రాంత పరిధిలోని మొత్తం 16 జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

వర్షాలతోపాటు భీకర గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాచు. ఇదిలాఉంటే.. సముద్ర తీరం పొడవునా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు.