Telugu States Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న వాయుగుండం..మూడు రోజులపాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాయుగండం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది రాగల 48గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. రెండింటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాబోయే మూడు రోజులు కుండపోతగా వానలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

Telugu States Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాయుగండం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది రాగల 48గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. రెండింటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాబోయే మూడు రోజులు కుండపోతగా వానలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

భారీ వర్ష సూచనతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంట బలమైన గాలులు గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. కొన్ని జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన చేసింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 10 వరకు ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు ప్రకటించారు. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Telangana Rains : తెలంగాణలో ఆగస్టు 9 వరకు భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయిందని అధికారులు చెప్పారు.

ఉత్తర తెలంగాణ జిల్లాలలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో ఉదయం నుంచి జల్లులు పడుతున్నాయి. ఆకాశమంతా దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. కొన్నిప్రాంతాల్లో ఉన్నట్టుండి అరంగటకు పైగా వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, రాజేంద్రనగర్, గోల్కొండ, సలహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఆకస్మికంగా పడిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు