Telangana Rains : తెలంగాణలో ఆగస్టు 9 వరకు భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణను మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 9 వరకు పలు జిల్లాలలో కుంభవృష్టి కురియనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Telangana Rains : తెలంగాణలో ఆగస్టు 9 వరకు భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Heavy rains in Telangana (1)

Telangana Rains : ఇప్పటికే భారీ వర్షాలతో వణుకుతున్న తెలంగాణను మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 9 వరకు పలు జిల్లాలలో కుంభవృష్టి కురియనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

కొన్ని జిల్లాలలో కుండపోత వర్షాలు, మరికొన్ని జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది. రాగల 24 గంటలలో నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యపేట, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలలో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Andhra Pradesh Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

అటు ఆదిలాబాద్‌, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, సిద్ధిపేట, జనగాం, వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది

ఈ నెల 8న 9 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.