Andhra Pradesh Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తతున్నాయి. కుండపోత వానలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన చేసింది.

Andhra Pradesh Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ తొమ్మిది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

Andhra Pradesh Rain Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తతున్నాయి. కుండపోత వానలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 5న విస్తారంగా వానలు పడతాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఐదు నుంచి ఆరు జిల్లాలు మినహా అన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 9 జిల్లాల్లో భారీ వానలు పడతాయంది. కర్నూల్, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోత వర్షం పడొచ్చంది.

”ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5న విస్తారంగా వానలు పడతాయి. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోత వర్షం పడొచ్చు” అని యని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది.

కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ట్వీట్ చేసింది. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే వివరాలతో కూడిన మ్యాప్ ను కూడా జత చేసింది.

ఆ 9 జిల్లాల్లో భారీ వర్షాలు..!