Vallabhaneni Balasouri: భారీ బహిరంగ సభ నిర్వహించి.. పవన్‌ను ఆహ్వానించి.. జనసేనలో చేరనున్న బాలశౌరి?

జనసేన తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నారు.

Vallabhaneni Balasouri

వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం కీలక నేత వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ నెల 18న లేదా 21వ తేదీన బందరులోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించి ఆ సమయంలోనే ఆయన సమక్షంలో జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నారు.

మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేశ్‌తో తీవ్ర విభేదాలు రావడంతో వైసీపీకి బాలశౌరి చాలా కాలంగా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బందరు నుంచి పోటీ చేసి తను ఏమిటో నిరూపిస్తానని సన్నిహితుల దగ్గర ఆయన మాట్లాడినట్లు సమాచారం.

బాలశౌరి ప్రయాణం ఇలా..

  • 2004లో తెనాలి ఎంపీగా పనిచేసిన వల్లభనేని బాలశౌరి
  • 2009లో నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలశౌరి
  • 2013లో వైసీపీలో చేరిన బాలశౌరి
  • 2014లో గుంటూరు లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వల్లభనేని బాలశౌరి
  • 2019లో మచిలీపట్నం ఎంపీగా వైసీపీ తరఫున గెలిచిన బాలశౌరి

ఆ హామీతో మెత్తబడిన మల్లాది..! విజయవాడ సెంట్రల్‌లో కొలిక్కి వచ్చిన వివాదం..!