ఆ హామీతో మెత్తబడిన మల్లాది..! విజయవాడ సెంట్రల్‌లో కొలిక్కి వచ్చిన వివాదం..!
మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం చర్చలు జరిపింది. ఇద్దరూ కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశించింది.

YCP MLA Malladi Vishnu Episode
Velampalli Srinivasa Rao : వైసీపీలో కొత్త ఇంఛార్జీల వివాదం కొలిక్కి వస్తోంది. విజయవాడ సెంట్రల్ లో బుజ్జగింపులు చివరి దశకు చేరుకున్నాయి. మల్లాది విష్ణుతో పలు దఫాలుగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఎమ్మెల్సీ ఇస్తామన్న అధిష్టానం హామీకి మల్లాది విష్ణు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మల్లాది విష్ణు స్థానంలో వెలంపల్లి శ్రీనివాస్ ను ఇంఛార్జిగా నియమించారు సీఎం జగన్. దీంతో మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం చర్చలు జరిపింది. ఇద్దరూ కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశించింది. ఒకటి రెండు రోజుల్లో ఇద్దరూ కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read : ఈ సీట్లపైనే పీటముడి.. ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన నేతలు వీరే..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల మార్పు వ్యవహారంలో నెలకొన్ని సందిగ్దత కొలిక్కి వచ్చింది. దశలవారిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో అధిష్టానం నిర్వహించిన చర్చలు దాదాపుగా ఫలించాయి. మల్లాది విష్ణు చాలావరకు మెత్తబడ్డారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో మల్లాది విష్ణు మెత్తబడినట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ లో ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును తప్పించి ఆయన స్థానంలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ను.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించారు జగన్.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లేదని జగన్ చెప్పడంతో మల్లాది విష్ణు కొంత అసంతృప్తికి లోనయ్యారు. కొన్నిరోజులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఎవరితోనూ టచ్ లో లేరు. అధిష్టానం రెండుసార్లు చర్చలకు పిలిచినా మల్లాది విష్ణు వెళ్లలేదు. ఒకానొక సమయంలో మల్లాది విష్ణు పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అయితే వైసీపీ అధిష్టానం మల్లాది విష్ణుతో మాట్లాడింది. కీలక నేతలు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఆయన కొంత మెత్తబడినట్లు సమాచారం.
Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?
సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జిగా నియమితులైన మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా మల్లాది విష్ణుని పలుమార్లు కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. దీంతో మల్లాది విష్ణు మెత్తబడ్డారు. అధిష్టానం పట్ల సరైన వైఖరితో ఉన్నారని సమాచారం. పండగ తర్వాత రెండు మూడు రోజుల్లో మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సెంట్రల్ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాస్ ను గెలిపించే బాధ్యతను తీసుకుంటాను అనే స్పష్టమైన ప్రకటన ఇరువురూ చేసే అవకాశం ఉంది.