JanaSena-TDP: ఈ సీట్లపైనే పీటముడి.. ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన నేతలు వీరే..

ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన అభ్యర్థుల సీట్లపైనే పీటముడి పడే అవకాశం ఉంది.

JanaSena-TDP: ఈ సీట్లపైనే పీటముడి.. ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన నేతలు వీరే..

Chandrababu Naidu- Pawan Kalyan

Updated On : January 13, 2024 / 10:32 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశమై చర్చలు జరిపారు. దాదాపు మూడున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. ఇందులో టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పన వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

జనసేన, టీడీపీ అభ్యర్థుల విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అభ్యర్థుల పేర్లు, వారి బలాబలాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన అభ్యర్థుల సీట్లపైనే పీటముడి పడే అవకాశం ఉంది.

ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన ఆశావాహ అభ్యర్థులు..

  • తెనాలి- ఆలపాటి రాజా( టీడీపీ), నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
  • పిఠాపురం-వర్మ( టీడీపీ), తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ లేదా ముద్రగడ( జనసేన)
  • రాజానగరం- బొడ్డు వెంకటరమణ(టీడీపీ), బత్తుల బలరామకృష్ణ( జనసేన)
  • అవనిగడ్డ- మండలి బుద్దప్రసాద్‌(టీడీపీ), రామకృష్ణ( జనసేన జిల్లా అధ్యక్షుడు)
  • విజయవాడ వెస్ట్‌- బుద్దా వెంకన్న(టీడీపీ), పోతిన మహేశ్‌ ( జనసేన)
  • గుంటూరు వెస్ట్‌- కోవెలమూడి రవీంద్ర(టీడీపీ), బోనబోయిన శ్రీనివాస యాదవ్‌( జనసేన)
  • పెందుర్తి- బండారు సత్యనారాయణ(టీడీపీ), పంచకర్ల రమేశ్‌ ( జనసేన)
  • భీమిలి-గంటా శ్రీనివాసరావు లేదా రాజాబాబు(టీడీపీ), పంచకర్ల సందీప్‌( జనసేన)
  • నెల్లిమర్ల – బంగార్రాజు(టీడీపీ), లోకం మాధవి( జనసేన)
  • ధర్మవరం- పరిటాల శ్రీరాం లేదా గోనుగుంట్ల సూర్యనారాయణ(టీడీపీ), మధుసూదన్‌ రెడ్డి( జనసేన)
  • చీరాల- కొండయ్య యాదవ్‌(టీడీపీ), ఆమంచి స్వాములు( జనసేన)
  • కాకినాడ- కొండబాబు(టీడీపీ), ముత్తా శశిధర్‌( జనసేన)
  • అమలాపురం- ఆనందరావు(టీడీపీ), రాజబాబు( జనసేన)
  • నర్సాపురం- బండారు మాధవనాయుడు(టీడీపీ), బొమ్మిడి నాయికర్‌ ( జనసేన)
  • నర్సారావుపేట- నల్లపాటి రాము(టీడీపీ), సుభాణి ( జనసేన)
  • పెడన- కాగిత కృష్ణప్రసాద్‌(టీడీపీ), బూరగడ్డ వేదవ్యాస్‌( జనసేన)
  • రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) కందుల దుర్గేశ్(జనసేన)
  • తణుకు- అరుమిల్లి రాధాకృష్ణ(టీడీపీ), విడివాడ రామచంద్రరావు (జనసేన)
  • ఉంగుటూరు- గన్ని ఆంజనేయులు (టీడీపీ), పి.దర్మరాజు (జనసేన)

BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఎన్ని సీట్లో తెలుసా? ఏయే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయ్?