Maganti Babu Son Death : మాగంటి బాబుకు పుత్ర వియోగం.. రెండో కుమారుడు రవీంద్ర మృతి

ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి (రవీంద్ర) మృతిచెందారు. 

Maganti Babu Second Son Ravindra Passed Away

Maganti Babu Son Ravindra : ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబుకు పుత్ర వియోగం కలిగింది. ఆయన రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి (రవీంద్ర) కూడా మృతిచెందారు.  మద్యానికి బానిస అయిన రవీంద్రను ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ కోసం చేర్పించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన తప్పించుకుని ఒక హోటల్‌లో తలదాచుకున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని పార్క్ హయత్ ప్లాజాలో ఉన్న రవీంద్ర బ్లడ్ వామిటింగ్‌తో  అనుమానాస్పదంగా మృతిచెందినట్టు సమాచారం. రవీంద్ర మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఏలూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం రాంజీని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.