Srisailam
Mahashivaratri Bramhotsavalu : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 22 వ తేదీ నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి అన్ని సేవలను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో నల్లమల అడవుల నుంచి కాలినడకన శ్రీశైలం వచ్చే భక్తులు, శివస్వాములకు ప్రాధాన్యత ఇస్తామని ఆలయ ఈవో లవన్న పేర్కొన్నారు. నల్లమలలోని పెద్దచెరువు నాగలూటి వెంకటాపురం భీమునికొలను వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
Perni Nani: చిరంజీవిది పెద్ద మనసు.. ప్రభుత్వం దృష్టికి సమస్యలు- మంత్రి పేర్నినాని
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తలు తప్పనిసరిగా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.