అక్రమ సంబంధం : ప్రియురాలిపై పెట్రోల్ తో దాడి చేసిన ప్రియుడు

man attack with petrol on woman : వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆమెతో జరిగిన గొడవల వలన కారణంగా పెట్రోల్ పోసి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఈ ఉన్మాద ఘటన వెలుగు చూసింది.

ఆచంటకు చెందిన నెక్కంటి నరేశ్ అనే వ్యక్తి మండలంలోని భీమలాపురంలోని ఒకవివాహిత మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లనుంచి ఇద్దరిమధ్య అభిప్రాయబేధాలు వచ్చి ఆమెతో గొడవలు జరుగుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో మంగళవారం ఉదయం ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమె ముఖంపై పెట్రోల్ పోసి హతమార్చేందుకు యత్నించాడు.

నరేశ్ ప్రయత్నాన్ని మహిళ భర్త, తల్లి , ఆమె సోదరి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారికి గాయాలయ్యాయి. ఉన్మాది చేతులకు గాయలయ్యాయి. బాధితులను పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయంతెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.