Vizianagaram : పెళ్లైన మూడు నెలలకే విషాదం.. నవవరుడు మృతి

పెళ్లైన మూడు నెలలకే నవవరుడు మృతి చెందాడు. వినాయక నిమజ్జనం సమయంలో చెరువులో మునిగి ప్రాణాలు విడిచాడు.

Vizianagaram : విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే ప్రమాదవశాత్తు నవవరుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే సాలూరు పట్టణంలోని దుర్గాన వీధికి చెందిన రాంబార్కి తిరుపతిరావు(29) విశాఖపట్నం పెప్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల కుమారితో జూన్ 24న తిరుపతిరావుకు వివాహం జరిగింది. వినాయక చవితిని అత్తవారింట్లో సరదాగా జరుపుకుందామన్న ఉద్దేశంతో భార్య భర్తలిద్దరూ జన్నివలస వెళ్లారు.

Read More :  MAA Elections 2021 : బండ్ల గణేష్‌కు ప్రకాష్ రాజ్, జీవిత సెటైర్..

వినాయక పూజను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిపారు. అదేరోజు సాయంత్రం గ్రామ పొలిమేరల్లో ఉన్న పత్తిగుళ్లవాని చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు. గత కొద్దీ రోజులుగా వర్షాలు కురవడంతో చెరువు నిండా నీరు చేరింది. అయితే చెరువు లోతు తెలియకుండానే తిరుపతిరావు అందులోకి దిగారు. కాలు జారడంతో లోపలికి జారిపోయాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు.

Read More : Rashmi Gautam: కైపెక్కించే పోజులతో మెరిసిపోయే బుల్లితెర క్వీన్ రష్మీ!

అక్కడ ఉన్న కుమారి, మరికొందరు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి తిరుపతిరావును ఒడ్డుకు తీశారు. అప్పటికే నీరు ఎక్కువగా తాగడంతో హుటాహుటిన సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడికి వెళ్లేలోపే తిరుపతిరావు మృతి చెందారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తల్లిదండ్రులు తవుడమ్మ, తవుడు, అత్త బుచ్చమ్మ, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు