Sai Dharam Tej : హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. వెంటిరేటర్‌పై ఉంచే కాలర్ బోన్ సర్జరీ చేశారు. డాక్టర్‌ అలోక్‌ రంజన్‌ నేతృత్వంలో కాలర్‌బోన్‌ సర్జరీ చేశారు.

Sai Dharam Tej : హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ

Saidharam Tej

Collar bone surgery : మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. వెంటిరేటర్‌పై ఉంచే కాలర్ బోన్ సర్జరీ చేశారు. డాక్టర్‌ అలోక్‌ రంజన్‌ నేతృత్వంలో కాలర్‌బోన్‌ సర్జరీ చేశారు. సాయి తేజ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

కాసేపట్లో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. తేజ్‌కు తల, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని ఇప్పటికే వైద్యులు తెలిపారు. బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగిలే అవకాశం ఉందని.. అందుకే 48 గంటల పాటు ఆయనను క్లోజ్‌గా మానిటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు.

Medicover : గోల్డెన్ అవర్‌లో తీసుకొచ్చారు…సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది

రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడిన విషయం తెలిసిందే. తాను రైడ్ చేస్తున్న స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే షాక్ కి గురి కావడంతో సాయితేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తేజ్ ను ముందుగా హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. బైక్ పై వస్తున్న తేజ్.. బైక్ స్కిడ్ కావడంతో పడిపోయాడు. అయితే తలకు హెల్మెట్ ఉండటంతో తలకు రక్షణ లభించింది. లేదంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని పోలీసులు అన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం పోలీసులు తెలిపారు.