Minor Girl Rape : టీవీ చూసేందుకు వెళ్లిన బాలికను గర్భవతిని చేశాడు, నిందితుడు అరెస్ట్

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ దొరకడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. టీవీ చూసేందుకు తన ఇంటికి వచ్చిన బాలికపై ఓ నీచుడు కన్నేశాడు. బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు.

Minor Girl Rape

Girl Rape : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ దొరకడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. టీవీ చూసేందుకు తన ఇంటికి వచ్చిన బాలికపై ఓ నీచుడు కన్నేశాడు. బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

పదమూడేళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూనమహాలక్ష్మినగర్‌లో ఉండే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు మానసిక రుగ్మతతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటోంది. చిన్న కూతురు(13) 6వ తరగతి చదువుకుంటోంది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తారు. కూతుళ్లు ఇంట్లోనే ఉంటారు. అదే బస్తీలో రాములు కుటుంబం నివాసముంటోంది.

చిన్న కూతురు టీవీ చూడటానికి రాము ఇంటికి వెళ్లేది. ఆ సమయంలో బాలికపై రాము కన్నేశాడు. ఓ రోజు టీవీ చూసేందుకు వచ్చిన బాలికను బెదిరించాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. గత అక్టోబర్ లో ఈ ఘోరం జరిగింది.

అప్పటి నుంచి పలుమార్లు రాములు అఘాయిత్యం చేశాడు. కాగా, మే 24న మధ్యాహ్నం బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆరు నెలల గర్భిణి అని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. బాలికను నిలదీయగా జరిగిన విషయం తెలపింది. బాలిక తల్లిదండ్రులు మే 25న జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే సెక్టార్‌ ఎస్ఐ కేసు నమోదు చేయలేదని… స్థానిక నేతలు మధ్యవర్తిత్వం నిర్వహించి రూ.30 వేలు నష్టపరిహారం ఇస్తారని, కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. 5 రోజులు కావస్తున్నా పోలీసులు కేసు పెట్టలేదు. దీంతో బాలిక బంధువులు స్థానిక నేతలను సంప్రదించారు. దీంతో విషయం బయటకు పొక్కి దుమారం రేగింది. అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. అత్యాచారం కేసు నమోదు చేసి నిందితుడు రాములును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. బాలికను గర్భతిని చేసిన నీచుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.