Man Sets Wine Shop On Fire
Visakhapatnam Man Sets Wine Shop On Fire : మద్యం ఇవ్వలేదని ఓ వ్యక్తి వైన్ షాప్‌కు నిప్పు పెట్టాడు. వైన్ షాప్, సిబ్బందిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వైన్‌షాపుకు నిప్పంటించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోతినమల్లయ్య పాలెం ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్‌షాప్ వద్దకు మధు అనే వ్యక్తి వచ్చి మద్యం ఇవ్వాలని అడిగారు.
అయితే షాప్ మూసివేసే సమయం కావడంతో షాపు సిబ్బంది మద్యం ఇవ్వ లేదు. దీంతో సదరు వ్యక్తి షాప్ సిబ్బందితో గొడవ పడ్డాడు. వ్యక్తి, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సిబ్బందిని హెచ్చరిస్తూ అక్కడి నుండి వ్యక్తి వెళ్లిపోయాడు. అదే వ్యక్తి ఆదివారం సాయంత్రం పెట్రోల్ బాటిల్ తో వైన్ షాప్ కు తిరిగి వచ్చాడు. షాప్ లోపల, సిబ్బందిపై పెట్రోల్ పోసి వెంటనే నిప్పంటించాడు.
Fire Breaks Out : గుజరాత్ అహ్మదాబాద్‌లో అగ్ని ప్రమాదం
షాప్ లోని సిబ్బంది పారిపోగా, వైన్ షాప్ దగ్ధమైంది. కంప్యూటర్, ప్రింటర్ సహా రూ.1.5 లక్షలకు పైగా ఆస్తి నష్టవాటినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ 307, 436 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు.