Fire Breaks Out : గుజరాత్‌ అహ్మదాబాద్‌లో అగ్ని ప్రమాదం

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వెంటనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని ఘటనా స్థలంలో ఉన్న అధికారి తెలిపారు.

Fire Breaks Out : గుజరాత్‌ అహ్మదాబాద్‌లో అగ్ని ప్రమాదం

Fire breaks out

Updated On : November 13, 2023 / 8:49 AM IST

Gujarat Fire Breaks Out : గుజరాత్‌ లో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని వస్నా స్వామినారాయణ్ పార్క్ ఓపెన్ గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వెంటనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని ఘటనా స్థలంలో ఉన్న అధికారి తెలిపారు.

ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. వస్నా ప్రాంతంలోని స్వామినారాయణ్ పార్క్ ఓపెన్ గ్రౌండ్‌లో వ్యర్థాలు, చెత్తకు మంటలు అంటుకుని మంటలు చెలరేగాయని అహ్మదాబాద్‌లోని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఇనాయత్ షేక్ చెప్పారు.

Firecrackers : దీపావళి పండుగలో పలు చోట్ల అపశ్రుతి… బాణసంచా పేల్చుతూ గాయపడ్డ చిన్నారులు

మొత్తం ఐదు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలంలో ఉన్నాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిందని, త్వరలోనే మంటలను పూర్తిగా ఆర్పివేస్తామన్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు, ప్రాణనష్టం జరుగలేదని తెలిపారు.