Manchu Manoj
తిరుపతి రూరల్ రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ విద్యానికేతన్‌లో ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీనిపై మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ స్పందిస్తూ.. ఆ ఆందోళనల గురించి తెలుసుకున్నానని, తనకు చాలా బాధ కలిగిందని చెప్పారు.
తమ తండ్రి, ఛాన్సలర్ మోహన్ బాబు విద్యార్థులు, రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తూ ఉంటారని తెలిపారు. ఇది ఈ సంస్థల విజయంలో ప్రతిబింబిస్తుందని, మోహన్ బాబు విజన్, ప్యాషన్, మనసును దృష్టిలో ఉంచుకుని, ఈ సమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్‌కి తన పూర్తి మద్దతును అందించాలనుకుంటున్నానని చెప్పారు.
పరిస్థితిని అంచనా వేయడానికి తాను ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్‌ని సంప్రదించానని తెలిపారు. ఆయన అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే mm.mbu0419@gmail.comకి ఈ-మెయిల్ పంపాలని ఆయన కోరారు. తాను వాటిని వ్యక్తిగతంగా తన తండ్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. తాము తమ విద్యార్థులకు, సమాజానికి మద్దతు ఇవ్వడంలో నిబద్ధతతో ఉన్నామని చెప్పారు.
I’ve been made aware of concerns at @IVidyanikethan #MBUniversity from it deeply saddens me. My father, Chancellor Sri Dr. Mohan Babu garu, has always prioritized the well-being of students and the Rayalaseema community, which is reflected in the success of these institutions.…
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2024
Also Read: ఏపీలో హైడ్రా ఏర్పాటు చేయాలి.. వాళ్ల ఇళ్లు కూల్చేయాలి: కేఏ పాల్