Manohar Nadendla Slams Botcha Satyanarayana
Manohar Nadendla Slams Botcha Satyanarayana : ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. టోఫెల్ టెస్ట్ విషయంలో మంత్రి బొత్స వైఖరిని ఎండగట్టారు. అసలు టోఫెల్ టెస్ట్ ఎవరు అడిగారు? ఒక ప్రైవేట్ సంస్థకి రూ.156 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
ముందు అగ్రిమెంట్ చదవండి..
జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. మంత్రి బొత్సని సీఎంవో మిస్ లీడ్ చేసింది. జనసేన పార్టీ టోఫెల్ పరీక్ష గురించి 3 రోజులకు ముందు చాలా స్పష్టంగా చెప్పింది. బహుశా మంత్రికి ఈ విషయం మీద అవగాహన లేనట్టుంది. మంత్రి బొత్స ముందు అగ్రిమెంట్ చదవండి. మంత్రికి ఈ అగ్రిమెంట్ 54 పేజీలు ఉందన్న విషయం తెలుసా? 21 లక్షల మంది విద్యార్థులకు ఈ పరీక్ష పెడుతున్నాం అని మంత్రి చెప్పారు. 30లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు.
పిల్లలపై మానసిక ఒత్తిడి..
80వేల మందికి పరీక్ష పెట్టడానికి ఏ విధంగా గుర్తించారు మీరు? రూ.146 కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి జగన్ తరపున మీరు హామీ ఇస్తారా? అసలు ఈ టోఫెల్ టెస్ట్ ఎందుకు? 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ లెవెల్స్ పెరుగుతుందని చెబుతున్నారు. కానీ, పిల్లలని మానసికంగా ఒత్తిడికి గురి చెయ్యాలని అనుకుంటున్నారు. ఈటిఎస్ అగ్రిమెంట్ చాప్టర్ నెంబర్ 1 ఆర్టికల్ 15 లో స్పష్టంగా చెబుతుంది. మేమే ప్రింటింగ్ ఎక్కడ ఇవ్వాలో చెప్తాం. పేపర్ కూడా మేమే డిసైడ్ చేస్తాం అని చెప్పారు. అసలు వాళ్ళు ఎవరు డిసైడ్ చెయ్యడానికి. మంత్రి బొత్స మాత్రం ఖర్చే లేదు ఇది ఆన్ లైన్ అని చెబుతున్నారు. పాఠశాలల్లో మనం రెడీగా లేము అని డిపార్ట్ మెంట్ వాళ్ళు స్పష్టంగా చెప్పారు.
ఎవరు కోరారు టోఫెల్ టెస్ట్?
ఇంగ్లీష్ లో పిల్లలు బాగా అభివృద్ధి చెందాలి అంటే ముందు మంచి టీచర్స్ ని పెట్టండి. 156 కోట్లు ఒక ప్రైవేట్ సంస్థకి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? వేల మంది విద్యార్థులు అందుకే ప్రభుత్వ పాఠశాల నుండి డ్రాపౌట్ అయ్యారు. ప్రభుత్వం చేసే ఇలాంటి పనుల వల్లే అని అర్థం అవుతుంది. నిధులను దుర్వినియోగం చేయొద్దు. అసలు ఎవరు కోరారు టోఫెల్ టెస్ట్? విద్యార్థులా? వారి తల్లిదండ్రులా?
Also Read : జైలులో చంద్రబాబుకు ఏసీ పెట్టటానికి అదేమన్నా అత్తారిల్లా..? : సజ్జల సెటైర్లు
మీదసలు రాజకీయ పార్టీనేనా?
నిన్న రాజకీయాలు గురించి మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. శాశ్వత అధ్యక్షుడు అనేదే లేదు. మీరు ముఖ్యమంత్రి జగన్ ని శాశ్వత అధ్యక్షుడిగా ఎలా నియమించుకుంటారు అని ఎన్నికల కమిషన్ అడిగింది? సమాధానం చెప్పండి. అసలు మీదొక రాజకీయ పార్టీనేనా? ఒక క్రియాశీల సభ్యత్వం లేదు. క్రియాశీలక సభ్యులు లేరు. మీరు జనసేన పార్టీ గురించి విమర్శలు చేస్తారు. విమర్శలు చేసేముందు ఒకసారి ఆలోచించండి” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.