minister Roja
Minister Roja: ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటారు. మంత్రిహోదాలో ఆమె పాల్గొన్న ఫోగ్రాంలు ఇతర కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరిస్తుంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు చేశారు. నా జీవిత ప్రయాణంలో ఈ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. నా పుట్టినరోజుకి నా బిడ్డ ఇచ్చిన బహుమతి వెలకట్టలేనిది, అత్యంత అమూల్యమైనది. నా శ్రేయోభిలాషులుగా మీతో పంచుకోవాలనిపించింది అంటూ పోస్టు చేశారు.
Minister Roja : మరోసారి సొంత పార్టీ నేతల నుంచే మంత్రి రోజాకు నిరసన సెగ, గ్రామ సచివాలయానికి తాళం
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల బాగోగులు ఇంట్లో సొంత మనిషిలా ఎలాగైతే చూస్తున్నారో ఆయన పుట్టిన రోజున ఓ `బిడ్డకి బంగారు భవిష్యత్తు` నివ్వాలని సంకల్పించి రెండేళ్ళ క్రితం ఈ బంగారుతల్లిని నా కుటుంబంలోకి చేర్చుకుంటూ ఆ బిడ్డ చదువు భాద్యతలు తీసుకున్నాను అని తెలిపారు. అదే అన్నకి ఆ బహుమతిగా ఇచ్చాను. మనకు నచ్చిన వారి పుట్టిన రోజున బొకేలు బహుమతులు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రోజా ఆ పోస్టులో తెలిపారు. జగనన్నకి ఎంతో ఇష్టమైన`ఆడపిల్లకి ఉన్నత చదువు` ఆయన పుట్టిన రోజున నేను దత్తత తీసుకున్న పి.పుష్పకుమారికి కలిసి వచ్చింది. నీట్ పరీక్షలో రెండవసారి ర్యాంక్ సాధించింది. తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో సీటు సంపాదించి నా పుట్టిన రోజున నాకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిందని రోజా తెలిపింది.
సకాలంలో వైద్యమందక తన తల్లీతండ్రులను పోగొట్టుకున్న పుష్ప డాక్టరై భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడతాను నన్ను చదివించండి `అమ్మ` అని నాతో అన్నమాట నాకు ఇప్పటికి కంటతడి పెట్టిస్తోంది. ఆ చిట్టితల్లి సంకల్పానికి నేను, నా కుటుంబం తోడై ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటామని తెలియజేస్తూ.. నా బిడ్డకి మీరందరూ శుభాకాంక్షలు తెలియజేయండి, తనని దీవించండి, మీ దీవెనలే మాకు శ్రీరామరక్ష అంటూ రోజా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు చేశారు.