×
Ad

Maoists: ఒకే బిల్డింగ్‌లో 27మంది మావోయిస్టులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాష్ట్రం, పెనమలూరులో టెన్షన్ టెన్షన్..

4 చోట్ల డంప్ లు ఏర్పాట్లు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డంప్ ల గుర్తింపు, వాటి స్వాధీనం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Maoists: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్ లో పోలీసులు, ఆక్టోపస్ దళాలు స్టింగ్ ఆపరేసన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఛత్తీస్ గఢ్ కి చెందిన పలువురు మావోయిస్టులు అరెస్ట్ అయినట్లు సమాచారం. ఓ భవానాన్ని 27మంది మావోయిస్టులు షెల్టర్ గా చేసుకున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో 12మంది మహిళలు, నలుగురు కీలక హోదాలోని వ్యక్తులు, 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. 4 చోట్ల డంప్ లు ఏర్పాట్లు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డంప్ ల గుర్తింపు, వాటి స్వాధీనం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

హిడ్మాకు రక్షణగా ఉండేందుకు మావోయిస్టులు పెనమలూరులో షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు. కొత్త ఆటోనగర్ లోని ఓ భవనంలో 27మంది మావోయిస్టులు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు. హిడ్మాను ఎన్ కౌంటర్ చేసే సమయంలో అక్కడున్న మావోయిస్టుల నుంచి ఇచ్చిన భద్రతా బలగాలు కీలక సమాచారం రాబట్టాయి. ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారు, ఎక్కడెక్కడ షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేసుకున్నారు అనే సమాచారం వారి నుంచి రాబట్టారు. ఈ క్రమంలో కొత్త ఆటోనగర్ లోని భవనంలో తలదాచుకున్న మావోయిస్టుల గురించి తెలిసింది. వెంటనే భద్రతా దళాలు, పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

Also Read: U టైప్ దాడుల్లో మాస్టర్ మైండ్ హిడ్మా.. అసలు U టైప్ గెరిల్లా దాడి అంటే ఏంటి?

చాలా కాలం తర్వాత ఏపీలో మావోయిస్టుల భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో కీలక నేతలు మృతి చెందారు. ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఆశ్రయం పొందుతున్నారో అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మావోయిస్టులను ఏరివేస్తామని, అంతం చేస్తామని కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రాణాలతో ఉండాలి అంటే వెంటనే లొంగిపోవాలని, లేదంటే ప్రాణాలు వదులుకోవాలని మావోయిస్టులకు కేంద్రం తేల్చి చెప్పింది. అడవుల్లో వరుస కూంబింగ్ లు జరుగుతున్నాయి. దీంతో మావోయిస్టులు అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చి తలదాచుకుంటున్నారు. అలా తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం తర్వాత పరిస్థితులను బట్టి తమ ప్రణాళిక రూపొందించుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు.