AP Municipal Election 2021 : మేయర్ల ఎంపిక..సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్, ఖరారైన పేర్లు ఇవే!

mayor Election : కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ హైకమాండ్‌ దృష్టిపెట్టింది. పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కార్పొరేషన్లకు మేయర్‌లను ఖరారు చేయనున్నారు. కొన్ని కార్పొరేషన్లలో కొందరు నేతలు తమ వర్గానికే మేయర్‌ పదవి దక్కాలని పట్టుబడుతున్నారు. దీంతో మేయర్ అభ్యర్థి ఎంపికపై పీటముడి పడనుంది. దీనిపైనా పార్టీ నేతలతో చర్చించి ఓ క్లారిటీ ఇవ్వనున్నారు జగన్.

మేయర్ ఎవరు ?

ఒంగోలు మేయర్‌ అభ్యర్థిగా సుజాత.
గుంటూరు మేయర్‌ అభ్యర్థిగా కావటి మనోహర్‌ నాయుడు.
విశాఖ మేయర్‌ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌.

కర్నూలు మేయర్‌ అభ్యర్థిగా బీవై రామయ్య.
కడప మేయర్‌ అభ్యర్థిగా కే సురేష్‌ బాబు.
తిరుపతి మేయర్‌ అభ్యర్థిగా శిరీష పేర్లు.

సాయంత్రం అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ. విజయవాడ, విజయనగరం కార్పొరేషన్ల మేయర్‌ పదవులు కూడా బీసీలకే దక్కే అవకాశం ఉంది. మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. ఫ్యాన్‌ హావాకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పత్తా లేకుండా పోయాయి. మొత్తం 11 కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం కార్పొరేషన్ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు