Mekapati Chandrasekhar Reddy: మేకపాటి కుటుంబంలో ఆస్తి వివాదం.. పరువు బజారుకీడుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు!

ఆస్తి ఇవ్వకపోవడం వల్లే తాను గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీ (TDP) లో చేరాల్సి వచ్చిందని ఆయన అసలు కారణాన్ని వెల్లడించారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrasekhar Reddy).

Mekapati Chandrasekhar Reddy sensational comments about his brother Rajagopal Reddy.

  • ఆస్తి ఇవ్వకుంటే పరువు బజారుకే!
  • అన్న కోసమే టీడీపీలో చేరా.
  • తమ్ముడూ.. ఇంట గెలిచి రచ్చగెలు!

Mekapati Chandrasekhar Reddy: మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, కుటుంబ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తన కుటుంబ సభ్యులు తనకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వలేదని ఆయన బహిరంగంగా ఆరోపించారు. ముఖ్యంగా తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వకపోవడం వల్లే తాను గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీ (TDP) లో చేరాల్సి వచ్చిందని ఆయన అసలు కారణాన్ని వెల్లడించారు.

Pawan Kalyan: NTTPS బూడిద కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోకస్.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

ఆస్తుల పంపకాల్లో తనకు న్యాయంగా రావాల్సిన సమాన వాటాను ఇవ్వకపోతే, కుటుంబ పరువును బజారుకీడుస్తానని చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrasekhar Reddy) హెచ్చరించారు. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అంటూ ఇంట్లో సమస్యలను ముందు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఆస్తి వివాదం తేలకపోతే చట్టపరంగా లేదా బహిరంగంగానైనా పోరాడటానికి సిద్ధమనే సంకేతాలను ఆయన ఇచ్చారు.

ఇదే సమయంలో తన రాజకీయ బలాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తిని నేనేనని, ప్రజల్లో తనకు బలమైన ఆదరణ ఉందని స్పష్టం చేశారు. కుటుంబంలోని అంతర్గత ఆస్తి తగాదాలు ఈ విధంగా రోడ్డుకెక్కడం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.