AP Rain Alert : ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు పిడుగులు, భీకర గాలులతో వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ
AP Rain Alert : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. వారం రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
- Harish Thanniru
- Published on- June 30, 2026 / 06:59 AM IST
- ఏపీకి రెయిన్ అలర్ట్..
- వారం రోజులు దంచికొట్టనున్న వానలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
AP Rain Alert : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ (Meteorological Department) బిగ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలకుతోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు, భీకర గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంది. నేటి నుంచి వారం రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : AP EAPCET Results 2026 : విద్యార్థులకు అలర్ట్.. 30న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
నైరుతి రుతుపవనాలకుతోడు ఉత్తర తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్ల్లాల్లో వారంరోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మంగళవారం రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఆంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వర్షాలు, ఈదురు గాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
