AP Rain Alert: ఏపీ ప్రజలకు IMD అలర్ట్.. రాగల 3 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ (AP Rain Alert)రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త అందించింది.
- V Santhosh Kumar
- Published on- September 10, 2026 / 05:24 PM IST
Meteorological Department issues orange alert and Heavy rains for ap
- ఏపీకి భారీ వర్షసూచన నమోదు
- తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- గంటకు ప్రచండ ఈదురు గాలులు
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త అందించింది. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటూ, భానుడి తాకిడికి ఎండాకాలాన్ని తలపించేలా తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాగల 3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల రాకతో వాతావరణం చల్లబడి, తీవ్రమైన ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు:
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం సహా మొత్తం తొమ్మిది జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. వర్షం(AP Rain Alert) పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద ఉండకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక:
వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ఈదురుగాలుల ధాటికి చెట్ల కొమ్మలు నరకడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున సంబంధిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. ఈ వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది.
